ఆకలి మరియు జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం 11616...India
తన 11 ఏళ్ల కుమార్తెకు గత ఐదు ఏళ్లుగా ఆకలి తక్కువ ఉండడం పట్ల తల్లి ఆందోళన చెందసాగారు. వారు సమష్టి కుటుంబంలో నివసిస్తు ఉండగా పాప వయసు సోదరీ సోదరులు అందరూ బాగానే తింటూ ఉండేవారు. తన పాపను సరిగ్గా తినేలా చేయడానికి ఎన్నో వ్యూహాలను ప్రయత్నించినప్పటికీ అవి విజయవంతం కాలేదు. అంతేకాక గత రెండేళ్లుగా, ఈ పాప పాఠశాలలో నేర్చుకున్న వాటిని జ్ఞాపకం ఉంచుకోవడానికి కూడా చాలా కష్టపడుతోంది. 2019 ఆగష్టు 5 న, ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది.
CC4.1 Digestion tonic + CC12.2 Child tonic + CC17.3 Brain & Memory tonic…BD నీటిలో
ఆమె పాఠశాల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని BD మోతాదు ప్రామాణిక TDS కన్నా చాలా ఆచరణాత్మకంగా అనిపించింది. మూడు నెలల తరువాత, అమ్మాయి ఆకలి మరియు జ్ఞాపకశక్తి 50 నుండి 60% వరకు మెరుగుపడింది. మరో రెండు నెలల్లో పాప తన తల్లి సంతృప్తి మేరకు చక్కగా తినడమూ మరియు ఆమె జ్ఞాపకశక్తి సమస్య కూడా అదృశ్య మవడం జరిగింది. నెల తరువాత అనగా 2020 ఫిబ్రవరి 15న, ప్రాక్టీషనరు మోతాదును OD కి తగ్గించారు. ఆమె మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నందున, రెమిడీ 2020 నవంబర్‌లో ఆపివేసారు. ఏప్రిల్ 2021 నాటికి, అమ్మాయి బాగానే ఉంది.