క్రిష్టల్ మెత్ (మాదక ద్రవ్యం) వ్యసనము 03591...Indonesia
33 ఏళ్ల వ్యక్తి గత రెండేళ్లుగా ప్రతీ రోజూ క్రిస్టల్ మెత్ (మెథాంఫేటమిన్ అనే ఉద్దీపన కోసం వాడే మాదక ద్రవ్యం) ధూమపానానికి బానిసయ్యారు. అతను తనకు తానే గదిలో వంటరిగా ఉంటూ భార్య మరియు కొడుకుతో దూరంగా ఉండడంతో 2020 సెప్టెంబరులో వారు అతనిని విడిచిపెట్టారు. అందువల్ల అతను తన వ్యసనాన్ని వదులుకోవాలని నిర్ణయించుకొని మాదకద్రవ్యాల వాడకం మానివేసారు. మూడు రోజుల్లో, ఉపసంహరణ లక్షణాలు తీవ్రమై చంచలత్వము, నిద్రలేమి, అలసట మరియు ఆ మత్తుమందు కోసం మరియు ఆహారం కోసం కోరిక తీవ్రంగా పెరిగిపోయింది. అతను వెంటనే 2020 సెప్టెంబర్ 29 న ప్రాక్టీషనరు సహాయం కోరగా క్రింది రెమిడీ ఇచ్చారు:
#1. CC10.1 Emergencies + CC15.3 Addictions…TDS
అతను వేరే చికిత్స ఏదీ తీసుకోలేదు. ఒక రోజు తరువాత తను ఎంతో శక్తివంతం అయినట్లు, అలసట 50% తగ్గినట్లు ఆనందంగా తెలియజేసారు. మాదక ద్రవ్యం కోసం కోరిక 75% తగ్గింది. ఒక వారం తరువాత అనగా అక్టోబర్ 7 నాటికి, చంచలత్వం, నిద్రలేమి మరియు అలసట పూర్తిగా అదృశ్య మయ్యాయి అలాగే మాదకద్రవ్యాల కోరిక కూడా 90% తగ్గింది. అయినప్పటికీ, ఆహారం విషయంలో తృష్ణ లో ఎటువంటి మార్పు లేదు. మరో మూడు వారాల తరువాత అక్టోబర్ 30 నాటికి అతను ఇకపై ఔషధం కోసం ఆరాటపడలేదు. ఐతే తిండి మీద ధ్యాస తగ్గక పోవడం వలన అధికంగా తింటూ తను బరువు పెరిగి పోతానేమో అని ఆందోళన చెందుతున్నారు. అందుచేత అతనికి క్రింది రెమిడీ కూడా ఇవ్వబడింది:
#2. CC15.4 Eating disordes…TDS
అంతేకాకుండా, ప్రాక్టీషనరు రోగికి వ్యాయామ దినచర్యను మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించమని సలహా ఇచ్చారు. డిసెంబర్ 1 న రోగి ఆహారం కోసం తనతృష్ణ 50% తగ్గిందని, చాలా కాలం తరువాత తనకు ఎంతో కులాసాగా ఉన్నట్లు అనిపించిందని తెలిపారు. అతను సంతోషంగా మరియు సంతృప్తికరంగా ఉండటానికి సానుకూల ధృక్పధం గల వ్యక్తులతో తనను తాను సామీప్యాన్ని ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు మరింత ప్రశాంతంగా, శక్తివంతంగా, ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో ఉండగలుగుతున్నారు.
2021 జనవరి 4 న, #1 BD కి తగ్గించబడింది మరియు తరువాత ఐదు నెలల వ్యవధిలో క్రమంగా 3TW కి తగ్గించబడింది. ఫిబ్రవరి 24 నాటికి అతి ఆహారం విషయంలో అతని కోరిక అంతరించిపోయింది. # 2 BD కి తగ్గించబడింది. మార్చిలో కూడా రోగి # 2 ను ఇదే మోతాదులో కొనసాగించాలని నిర్ణయించుకున్నారు, ఎందుకంటే # 2 అదనపు బరువు తగ్గడానికి అతనికి సహాయపడసాగింది. జూన్ 1 న అతను దీనిని 3TW కి తగ్గించారు. మాదక ద్రవ్య వినియోగం మెదడులో కొన్ని మార్పులకు కారణమై ఇది ఆపిన తర్వాత ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం దాని ప్రభావం ఉంటుంది కనుక అతను ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, 2021 జూన్ 14 వరకూ # 1 మరియు # 2… 3TW గా కొనసాగిస్తూనే ఉన్నారు. యాదృచ్ఛికంగా, అతను ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం సాయి బాబాను ప్రార్థిస్తున్నారు.