ఆందోళన రుగ్మత, వెన్నునొప్పి 03553...Canada
33 ఏళ్ల మహిళ వివాహం అయిన మూడు నెలల తర్వాత దుర్వ్యసనాల పాలైన భర్త నుండి విడాకులు తీసుకున్న కారణంగా ఆరు సంవత్సరాలుగా తీవ్ర ఆందోళన కలిగి ఉన్నారు. కారణం లేకుండా తరచుగా ఏడవడం, నిద్రా భంగం, ఏకాగ్రత లేకపోవడం మరియు కొన్నిసార్లు హృదయ స్పందన వేగం పెరగడం వంటి లక్షణాలు కలిగి ఉన్నారు. ఆమె ఎటువంటి మందులు తీసుకోలేదు కానీ ఆందోళన కోసం కొన్ని శ్వాస వ్యాయామాలు చేస్తున్నారు. అడపాదడపా ఆమెకు స్వల్ప వెన్నునొప్పి ఏర్పడి, కుడి పాదం వరకు ప్రసరించి మెలి తిప్పిన బాధ కలిగేది. ఐతే ఈ బాధకు కారణం ఐదేళ్ల క్రితం చేయించుకున్న సిజేరియన్ డెలివరీ కావచ్చని ఆమె భావిస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఆమె ఒక నెల పాటు మంచానికి కట్టుబడి ఉండవలసి వచ్చింది. ఆమె గత 10 నెలలుగా OTC పెయిన్ కిల్లర్స్ మరియు ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటున్నారు కానీ ఈ రెండూ స్వల్పకాలిక ఉపశమనం మాత్రమే ఇస్తున్నాయి. 2019 అక్టోబర్ 8 న ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
ఆందోళన కోసం :
#1. CC15.1 Mental & Emotional tonic...TDS నీటిలో …OD బెడ్ రూమ్ లో స్ప్రే చేయడం కోసం
వెన్ను నొప్పి కోసం :
#2. CC18.5 Neuralgia + CC20.5 Spine...TDS
ఆమె నొప్పి నివారణ మందులను ఆపివేసారు కాని ఫిజియోథెరపీతో కొనసాగించారు. రెండు నెలల తరువాత డిసెంబర్ 10 న, ఆమె నడుము నొప్పి విషయంలో 30% మెరుగుదల ఉన్నట్లు తెలిపారు, ఎందుకంటే ఆమె ముందు కంటే మెరుగ్గా నడవగలుగుతున్నారు. ఆమె ఆరోగ్య బీమా గడువు ముగియడంతో, ఆమె ఫిజియోథెరపీని ఆపివేసారు. ఆందోళన మునుపటి కంటే ఇప్పుడు తక్కువ ఉండడమే కాకుండా ఆమె ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నట్లు అనిపించ సాగింది. 2019 నవంబర్ లో ప్రాక్టీషనర్ SVP స్థాయికి పదోన్నతి పొందారు, ఆరు నెలలు వరకు SRHVP మిషన్ మాత్రమే ఉపయోయాగించాలనే నియమం ఉండడం మూలాన ప్రాక్టీషనరు # 1 మరియు # 2 లను భర్తీ చేయడానికి ఈ క్రింది రెమిడీ ఇచ్చారు:
ఆందోళన కోసం:
#3. NM6 Calming + NM69 CB8 + BR2 Blood Sugar + BR3 Depression + BR4 Fear + BR5 Heart + BR7 Stress...TDS and in water…OD to spray in her bedroom
వెన్ను నొప్పి కోసం:
#4. NM38 Back Pain + NM97 Sciatica + OM18 Sacral & lumbar + OM31 Spine: Lumbar-Sacral...TDS 2020 ఫిబ్రవరి 27 నాటికి, రెండు సమస్యలలో 80% మెరుగుదల కనిపించి మే 4 నాటికి పూర్తిగా కనుమరుగయ్యాయి. మోతాదు OD కి తగ్గించి క్రమంగా జూన్ 4 నాటికి పూర్తిగా ఆపివేయబడ్డాయి. తరువాతి ఆరు నెలల వరకు ఆమెకు CC12.1 Adult tonic మరియు CC17.2 Cleansing ఒకదాని తరువాత ఒకటి ప్రత్యామ్నాయ నెలలలో ఇవ్వబడ్డాయి. ఒక సంవత్సరం క్రితం రెమిడీలు ఆపివేయ బడ్డాయి కానీ ఆమె చక్కని ఆరోగ్యంతో జీవితం కొనసాగిస్తూ సాయి వైబ్రియోనిక్స్ కి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
108CC బాక్స్ ఉపయోగిస్తూ ఉన్నట్లైతే #3 : CC3.1 Heart tonic + CC15.1 Mental & Emotional tonic ; #4 : CC20.1 SMJ tonic + CC20.5 Spine ఇవ్వండి.