కీళ్ల నొప్పులు 02853...India
50 ఏళ్ల మహిళ గత రెండు సంవత్సరాలుగా కాళ్లలో నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. ప్రధానంగా ఆమె మోకాళ్ళ లో ప్రత్యేకించి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఆమె తన మోకాళ్లను వంచి నేల మీద గాని కుర్చీలో గాని కూర్చోలేరు. ఎక్కువ దూరం నడవలేరు. అల్లోపతీ వైద్యుడు ఆమెకు ఔషధం ఇచ్చి, మోకాళ్ళకు రాసుకోవడానికి లేపనం కూడా ఇచ్చారు. కానీ అవేమీ ఉపయోగపడలేదు. చల్లని వాతావరణం, ఒత్తిడి మరియు వయోభారం దీనికి కారణమని ఆమె తెలిపారు. 2012 నవంబర్లో, ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ఇచ్చారు:
CC15.1 Mental & Emotional tonic + CC20.1 SMJ tonic + CC20.3 Arthritis…TDS
రెమిడీ తీసుకున్న మూడు వారాల్లోనే తనకు పూర్తిగా నొప్పి లేకుండా పోయిందని రెండు నెలల తర్వాత ఆమె అభ్యాసకునకు తెలిపారు. ఆమె ప్రస్తుతం ఎక్కువ దూరం నడవ గలగడం, నేలపై సులభంగా కూర్చోవడం, అదేవిధంగా కుర్చీలో కూడా సౌకర్యవంతంగా కూర్చో గలుగుతున్నానని ఆనందం వ్యక్తపరిచారు.