బాధాకరమైన మొలలు 03592...South Africa
50 ఏళ్ల మహిళ గత ఐదు సంవత్సరాలుగా బాధాకరమైన మొలలు మరియు మల బద్దకంతో బాధపడుతున్నారు. వైద్యుడు ఆమెకు శస్త్రచికిత్స సిఫార్సు చేశారు. ఆపరేషన్ అంటే భయం కారణంగా ఆమె దానిని నిరాకరించారు. గత మూడు సంవత్సరాలుగా ఆమె అప్పుడప్పుడు నొప్పి మరియు మలబద్ధకం కోసం పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే అల్లోపతి మందులు తీసుకున్నారు కానీ ఇవి పెద్దగా సహాయం చేయలేదు. ఆమె వైబ్రియానిక్స్ తీసుకోవాలని నిర్ణయించుకొని 2020 ఏప్రిల్ 10న ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది రెమిడీ ఇచ్చారు:
CC4.4 Constipation…TDS
రోగి వేరే మందులు ఏమీ తీసుకోలేదు. ఏప్రిల్ 29న నొప్పి మరియు మలబద్ధకం రెండింటిలో 25% ఉపశమనం పొందారు. రెండు వారాల తరువాత అనగా మే 17న 50% మెరుగుదల కలిగింది. మొలలు వాటి అసలు పరిమాణంలో సగానికి తగ్గాయి. తర్వాత రెండు వారాల్లో మొలలు మరికొంత కుంచించుకు పోయాయి. జూన్ 1 నాటికి రోగికి 100% ఉపశమనం కలిగి మలబద్ధకం మరియు మొలలు పూర్తిగా కనుమరుగయ్యాయి. అంతేకాకుండా రోగి తన జీవిత కాలమంతా ప్రతీ నెలలో అనుభవిస్తున్న తిమ్మిరి మరియు భారీ రక్తస్రావం యొక్క సమస్య అనూహ్యంగా పూర్తిగా పోయిందని గమనించారు. ఇంతకుముందు ఈ సమస్యను ప్రాక్టీషనరు ముందు ప్రస్తావించ నందున బోనస్ గా ఏర్పడిన నివారణ పట్ల ఆమె ఎంతో ఆనందంగా ఉన్నారు. మోతాదు మూడు నెలల వ్యవధిలో BD, OD, 3TW, 2TW కి తగ్గించబడింది. చివరిగా 31 ఆగస్టు 2020 రెమిడీ ఆపాలని నిర్ణయించుకున్నారు ఎందుకంటే బాధాకరమైన సమస్యలు ఆమె జ్ఞాపకాల నుండి కూడా తొలగిపోయాయి. 2020 అక్టోబర్ నాటికి సమస్యలేవీ పునరావృతం కాలేదు.