Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

బ్లడ్ నోసోడ్ ద్వారా నయమైన బహుళ వ్యాధులు 02836...India


64 సంవత్సరాల వ్యక్తి గత 10 సంవత్సరాలుగా తీవ్రమైన మోకాలినొప్పి తో బాధపడుతూ ఉన్నారు. దీనితో పాటు వీరికి  ఉబకాయం, మలబద్దకం, నిద్రలేమి, ఆందోళన, వత్తిడి ఇలా అనేక సమస్యలు కూడా ఉన్నాయి. వీరు నిర్వర్తించే ఏ వ్యాపారములో నూ స్థిరంగా నిలవలేకపోయారు. మరో సమస్య ఏమిటంటే  గత 7 సంవత్సరాలుగా, రెండు కాళ్ళ మడమల పైన జన్యుపరమైన ఎక్జిమా వ్యాధితో వీరు బాధపడుతున్నారు. 2011 నవంబర్ 30 వ తేదీన 200C. పోటేన్సీ లో బ్లడ్ నోసోడ్ ను పుల్లౌట్ విషయంలో ఇబ్బంది రాకుండా ఉండడానికి, మొదటి వారం OD గానూ, రెండవ వారం BD గానూ, అనంతరం 2011డిసెంబర్ 15 నుండిTDS గానూ డోస్ తీసుకున్నారు.

ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి: మొదటి వారంలోనే మోకాలి నొప్పి 90% తగ్గిపోయి వీరు ఆనందంగా, తేలికగా, శక్తివంతంగా కనిపించ సాగారు. 2012 మార్చ్ 8 వ తేదీ నాటికి ఇతని ఎడమవైపు మడమ పైన ఎక్జిమా 40% మరియు కుడి మడమ పైన 80% తగ్గిపోయింది. దీనితో మరే విధమైన అలోపతి, ఆయుర్వేదం వంటి మందులేవీ వాడకుండా ఇదే నోసోడ్ ను  కొనసాగించారు.

2012 జూలై 8వ తేదీ నాటికి ఎడమవైపు మడమ మీద 80% కుడి వైపు మడమ మీద 90% మెరుగుదల కనిపించింది. ఆ తర్వాత పేషంటు నుండి ఏ సమాచారము లేదు కనుక ప్రాక్టీషనర్ ఇతనికి రోగ లక్షణాలు పూర్తిగా తగ్గినట్లు భావించారు.

 క్రింద చికిత్సకు ముందు వెనుక ఎక్జిమా ఫోటోలు ఇవ్వబడ్డాయి.

 08/03/2012తేదీన తీసిన ఫోటో                         08/07/2012తేదీన తీసిన ఫోటో