Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అడల్ట్స్ స్టిల్స్ వ్యాధి 02799...UK


25-సంవత్సరాల మహిళ 2012 లో ఆటో ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ యొక్క అరుదైన రూపమైన అడల్ట్ వ్యాధి తో బాధపడుతున్నారు.  ఆమెకు కీళ్ళ వాపుతో పాటు శరీరమంతా కండరాల నొప్పితో బాధపడుతున్నారు. కొన్ని నెలలు స్టెరాయిడ్స్ పై ఉండటం వల్ల కొంత ఉపశమనం కలిగింది. 2014 అక్టోబర్ లో ఆమె పరిస్థితి పూర్తిగా దిగజారడం తో ఆమె మూడు వారాల పాటు ఆస్పత్రిలో చేరింది. తరువాత నొప్పి తట్టుకోవడం కోసం స్టెరాయిడ్లు మరియు మార్ఫిన్ లతో సహా అధిక మోతాదు గల మందులు తీసుకోవడం జరిగింది. చికిత్స పొందుతూ ఉన్నప్పుడు 2015 మార్చిలో ఆమెకు బోలు ఎముకల వ్యాధి మరియు నడుముకు క్రింది భాగంలో వెంట్రుక మందం గల పగుళ్లు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఎముక పగులు నయం చేయటానికి మరియు ఆమెకు గల  తీవ్రమైన నొప్పిని తగ్గించడానికి విశ్రాంతి కోసం ఆమెకు కాల్షియం మరియు విటమిన్ డి మందులు ఇవ్వబడ్డాయి. ఈ పరిస్థితి అంతటికీ కారణం స్టెరాయిడ్స్ దీర్ఘకాలిక వినియోగం. మందులు తీసుకున్నప్పటికీ ఆమె సరిగా నడవలేక శరీరమంతా పూర్తిగా బాధతో మరియు అలసటతో ఉండేది. ఇటువంటి పరిస్థితిలో 2015 మే 10వ తేదీన ఆమె అభ్యాసకుని సంప్రదించారు. ఆమె యొక్క ESR స్థాయి 75 (సాధారణ స్థాయి 1-20 mm/hr) ఉంది.

ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది.

కీళ్ల వాతం మరియు బోలుఎముకల వ్యాధి:
#1. CC10.1 Emergencies + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.6 Osteoporosis + CC20.7 Fractures...QDS

మంటకు:
#2. NM45 Atomic Radiation + NM113 Inflammation + SM2 Divine Protection + SM5 Peace & Love Alignment + SM6 Stress + SR324 X-ray + SR348 Cortisone...QDS.

ఆమె అల్లోపతి మందులు అన్నిటితో పాటు వైబ్రియానిక్స్ నివారణలు కూడా కొనసాగించారు. ఆమెకు శక్తి చేకూరినట్లుగా అనుభూతి పొందడంతోపాటు రెండు వారాల్లో ఆమె అన్ని రకాల నొప్పినుండి 50 శాతం ఉపశమనం పొందారు. మరియు ఆమె ESR స్థాయి 28 కి తగ్గింది. ఆమె శక్తి స్థాయి 50 శాతానికి పైగా పెరిగింది మరియు ఆమె తన రోజువారీ పనులను చాలా తేలికగా చేసుకోగలుగు తున్నారు. మరో ఆరు వారాల తర్వాత  ESR స్థాయి 28 కి చేరింది. ఆమె, మెతోట్రెక్సెట్ (methotrexate) 20mg, తప్ప అన్ని  అల్లోపతి మందులు ఆపేసారు. అది కూడా తన పరిస్థితి మెరుగుపరచుకోవడానికి వారానికొకసారి మాత్రమే తీసుకుంటున్నారు. 2015 సెప్టెంబర్ నాటికి ఆమె 90% ఫిట్ గా తయారయ్యారు. ESR స్థాయి 25కు చేరింది. నొప్పులు మాయం కావడంతో చక్కగా వేగంగా నడవగలుగుతున్నారు మరియు తన పనిని తిరిగి ప్రారంభించ గలిగారు. మెతోట్రెక్సెట్ మోతాదు 12 mgకి తగ్గించబడడం తో పాటు #1 మరియు #2 మోతాదులను ఆరు నెలలు TDS ఆ తర్వాత 2016 మార్చి నుండి BD కి తగ్గించారు. ఏప్రిల్ 4 నాటికి ఆమెకు అన్ని నొప్పుల నుండి 100% ఉపశమనం కలిగిందని తెలిపారు. మరో 6 నెలలు తర్వాత 2016 అక్టోబర్ నాటికి ఆమె ESR స్థాయి 7 వద్ద స్థిరంగా ఉండటంతో ఆమె చాలా కాలంగా తీసుకుంటున్న Methotrexate తీసుకోవడం పూర్తిగా ఆపివేశారు. 2019 ఏప్రిల్ నాటికి ఎటువంటిపునరావృతం లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఏప్రిల్ 4 నాటికి #1 & #2 ను BD  గా మెరుగైన ఆరోగ్యం కోసం కొనసాగిస్తున్నారు.  ఆరోగ్యవంతమైన జీవనశైలిని కూడా అనుసరిస్తున్నారు. అంతేగాక గతంలో కుటుంబ జీవనం అసాధ్యమనుకున్న దానిని ఈ సంవత్సరం వివాహం చేసుకొని సుసాధ్యం చేయాలని భావిస్తున్నారు.   

108CC బాక్సు నుండి ఇచ్చేటట్లయితే #2: CC20.1 SMJ tonic…QDS