ఋతు శూల /నొప్పి 11542...India
16-ఏళ్ల అమ్మాయి గత రెండు సంవత్సరాలుగా ఋతు నొప్పితో బాధపడుతూ ఉన్నది. నొప్పి చాలా తీవ్రంగా ఉండడంతో రుతుక్రమము మూడు రోజులూ ఆమె తరగతులకు వెళ్ళడం మానేసేది. ఈ రెండు సంవత్సరాలుగా అలోపతి మాత్రలు తీసుకుంటూ ఉన్నా ఆమెకు ఏమాత్రం ఉపశమనం కలిగేది కాదు. 2018 మే నెలలో డేట్ వచ్చిన మొదటి రోజు తీవ్రమైన నొప్పితో ఈమె ప్రాక్టీషనర్ ను సంప్రదించారు.
ఈమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC8.7 Menses frequent + CC8.8 Menses irregular…TDS
మొదటి గోళీ తీసుకున్న గంటకే పేషంటుకు 100% ఉపశమనం కలిగింది. అంత త్వరగా నొప్పి నివారణ ఐనందుకు ఆమెకు ఎంతో ఆశ్చర్యము అనిపించింది. అంతేగాక ఆ మూడు రోజులూ కూడా ఆమెకు మరలా నొప్పి రాకపోవడంతో ఆమె తన తరగతులకు కూడా హాజరయ్యింది. ఈ విధంగా సూచించిన మేరకు ఆమె డోసేజ్ తీసుకునేది.
మరుసటి నెలలో ఆమెకు రుతుక్రమ మొదటిరోజు కొంచం నొప్పి అనిపించినా పట్టించుకోకుండా కాలేజీకి వెళ్ళింది. కానీ తరువాత రెండు రోజులు ఆమాత్రం నొప్పి రాలేదు. ఆ తరువాత డోసేజ్ OD కి తగ్గించబడింది. 2018 ఆగస్టు నాటికి వ్యాధి లక్షణాలు తిరిగి తలెత్తక పోవడంతో ఆమె ఇదే డోసేజ్ కొనసాగిస్తోంది.