కటి భాగంలో నడుము నొప్పి 03546...France
57సంవత్సరాల మహిళ 2017.జనవరి నుండి నడుమునొప్పి తో బాధ పడుతున్నారు .వీరికి 2011 మరియు 2016 లో నరాలకు సంబంధించిన కొన్ని సమస్యల వలన తొడకు సంబంధించిన నరానికి శస్త్ర చికిత్సలు జరిగాయి. ప్రస్తుతం ఆమెకు ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే కటి ప్రాంతంలో వెన్ను దగ్గర తీవ్రమైన నొప్పి వస్తోంది. 8 నెలల పాటు ఏవో కొన్ని నొప్పి నివారించే నూనెలతో వైద్యం చేయించుకున్నా ప్రయోజనం కనిపించలేదు. ఈమెకు వేరే ఇతర సమస్యలేవీ లేవు.
2017 సెప్టెంబర్ 1 న వీరు ప్రాక్టీ షనర్ ను కలవగా వీరికి క్రింది రెమిడి ఇచ్చారు :
CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC18.5 Neuralgia + CC20.2 SMJ pain + CC20.4 Muscles & supportive tissue...6TD మూడు రోజులు అనంతరం TDS
7 రోజుల తర్వాత వీరికి 70% నయంయ్యింది. రెండు వారాల తర్వాత నొప్పి పూర్తిగా అదృశ్యమయింది. ఆ తర్వాత ఆమె TDS గా మరో వారం వాడి అనంతరం మెల్లిగా తగ్గిస్తూ BD గా మరో వారము,చివరిగా OD గా 3 రోజుల పాటు వాడడం జరిగింది.
2017అక్టోబర్ నాటికి పేషంటుకు నొప్పి వంటి ఏ సమస్యా లేకుండా ఆనందంగా ఉన్నారు ,