Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అధిక రక్తపోటు తో కూడిన మదుమేహం 11423...India


49 సంవత్సరాల వ్యక్తి ప్రాక్టీషనర్ని సందర్శించిన సంవత్సరం క్రితం నుండి మధుమేహంతో బాధ పడుతూ ఉన్నట్లు నిర్దారించారు. అలాగే వీరికి అధిక రక్తపోటు మరియు  కొలెస్ట్రాల్ కూడా ఉంది. వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది:

CC3.3 High Blood Pressure + CC3.5 Arteriosclerosis + CC6.3 Diabetes…TDS.

స్వీయ పర్యవేక్షణ లోనే కొన్ని వారాలపాటు పేషంటు క్రమం తప్పకుండా మందులు వాడినప్పటికీ ఫలితం కనిపించలేదు.       ఐతే ఈ కాలంలో పేషంటు యొక్క లివరు కూడా దెబ్బతిన్న విషయం వెలుగులోనికి వచ్చింది. కనుక ప్రాక్టీషనర్
CC4.2 Liver and Gallbladder tonic ను పై రెమిడికి కలపడం జరిగింది. దీని తర్వాత పేషంటు తనకు క్రమంగా ఆరోగ్యం మెరుగవుతున్న విషయం గుర్తించారు. క్రమం తప్పకుండా చేయించుకుంటున్న పరీక్షల వలన పేషంటు యొక్క బ్లడ్ షుగర్ సాధారణ స్థాయికి వచ్చినట్లు గుర్తించారు. రెండు నెలల తర్వాత, చేయించుకున్న పరీక్షలో రక్తంలో చెక్కర స్థాయి 120/80 ఉండడమే కాక కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గిపోయింది. పేషంటు యొక్క కుటుంబ వైద్యుడు ఇతనితో నీవిప్పుడు డయాబెటిక్ పేషంటువు కాదు! అని చెపుతూ తను వాడుతున్న ప్రత్యామ్నాయ వైద్య విధానము గురించి ఆరా తీసారు. ఈ విధంగా అలోపతి మందులను చాలా వరకు తగ్గించి వైబ్రో కోమ్బో ను కొనసాగించారు.