సూర్య రశ్మి మరియు తల నూనె కు సంబంధించిన ఎలెర్జి 11422...India
2016 జూన్ 11 వ తేదీన ఈ చికిత్సా నిపుణుడు తన సాధారణ సందర్శన లో భాగంగా ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళినప్పుడు 60 ఏళ్ల వృద్ధుడు తాను 20 ఏళ్ళుగా తలనొప్పి తో బాధ పడుతున్నానని ఎండలోకి వెళితే చాలు భరింపరాని తలనొప్పి వస్తోందని తలకు టోపీ పెట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయిందని చెప్పాడు. దీని కారణంగా ఎండ లోనికి వెళ్ళడమే మానుకున్నాననీ తలనొప్పి భరించలేనిదిగా ఉన్నప్పుడు నొప్పి నివారిణి వేసుకుంటానని చెప్పారు. ఇంతే కాకుండా ఇతనికి తలలో దురద కూడా వస్తోందని బహుశా ఎండలోకి వెళ్ళినప్పుడు బి.పి పెరగడం వల్ల ఇలా జరుగుతుందేమోనని భావించానని చెప్పాడు. అతనికి క్రింది రెమిడి ఇవ్వబడింది:
#1. CC3.3 High Blood Pressure (BP) + CC3.7 Circulation + CC11.3 Headaches + CC11.4 Migraines + CC21.3 Skin allergies…TDS
నెల రోజుల్లోనే అతని తలనొప్పి, తల దురద తగ్గిపోయాయి. జూన్ 17 నాటికి తిరిగి ఈ ఇబ్బందులు తలెత్తలేదు.
2017, మార్చి 18 వ తేదీన ఇతను మరో సమస్యను ప్రాక్టీషనర్ దృష్టికి తీసుకు వచ్చారు. గత 6 నెలలుగా తలకు నూనె రాసిన ప్రతీసారీ తలపైన కురుపులు వస్తున్నాయి. దీని నిమిత్తము ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ఇచ్చారు.
#2. CC21.2 Skin infections + CC21.3 Skin allergies…6TD, ఇది పైన పూతకు కూడా ఇవ్వబడింది.
రెండు వారాలు తర్వాత అనగా 2017 ఏప్రిల్ 3 నాటికి అతనికి 50% తగ్గిపోయింది. కనుక డోసేజ్ ను TDS కు తగ్గించడం జరిగింది. ఏప్రిల్ నెలాఖరుకు అతనికి 100% తగ్గిపోయింది. 2017 మే వరకూ మందులు వాడారు ఇప్పటివరకు తిరిగి ఆ ఇబ్బందులు తలెత్తలేదు.