అలెర్జిక్ రైనైటిస్ (నాసికయందలి మంట- వ్యాధి), అజీర్ణం మరియు ఆందోళన 01001...Uruguay
32 ఏళ్లగా అలెర్జిక్ రైనైటిస్ (శ్వాసకోశ సమస్య) మరియు అజీర్ణం, ఉబ్బిన ఉదరం, తలనొప్పి వంటి రోగ లక్షణాలతో బాధపడుతున్న ఒక 49 సంవత్సరాల మహిళ చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. 2014 లో విడాకులు తీసుకున్న సమయం నుండి ఆమెకు ఆందోళన, భయం మరియు నీరసం వంటి మానసిక సమస్యలు ఏర్పడ్డాయి. ఓదార్పు కోసం ఆమెకు అమితముగా తినే అలవాటు ఉండేది.ఈ రోగ సమస్యల కొరకు ఆమె అంతకు ముందు ఏ విధమైన చికిత్సను తీసుకోలేదు. 2016 సెప్టెంబర్ 26 న రోగికి క్రింది మందులను ఇవ్వడం జరిగింది:
అజీర్ణం మరియు మానసిక సమస్యలు:
#1. CC4.1 Digestive tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.3 Addictions + CC15.4 Eating disorders + CC18.1 Brain disabilities…TDS
అలెర్జిక్ రైనైటిస్ (శ్వాసకోశ సమస్య):
#2. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.5 Sinusitis...TDS
ఆపై రెండు నెలలకు రోగి చికిత్సా నిపుణులను సంప్రదించలేదు. డిసెంబర్ 10 న మందులను తిరిగి తీసుకునేందుకు చికిత్సా నిపుణులను సంప్రదించింది. క్రమం తప్పకుండా మందులను తీసుకోవడం కారణంగా ఆమె యొక్క ఆరోగ్యం మెరుగుపడింది. నవంబెర్ నుండి రోగి యొక్క అజీర్ణం మరియు శ్వాసకోశ సమస్యలలో 100% మెరుగుదల ఏర్పడింది. ఆమె యొక్క మనోస్థితిలో కూడా మెరుగుదల ఏర్పడి తలనొప్పి సమస్య తొలగిపోయింది. 2017 జనవరి 16న రోగి పూర్తిగా కోలుకున్నట్లుగా చికిత్సా నిపుణులకు తెలిపింది. దీని కారణంగా మందుల మోతాదు BD కి తగ్గించబడింది. ఫిబ్రవరి 7న ఆమె యొక్క ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడినట్లు తెలిపింది. అందువలన మందు యొక్క మోతాదు మరో నెల వరకు OD కి తగ్గించాలని నిర్ణయించబడింది.