హైపోథైరాయిడిజం మరియు క్రమము లేని ఋతుస్రావం 11570...India
గత రెండున్నర సంవత్సరాలుగా హైపోథైరాయిడిజం(థైరాయిడ్ గ్రంథి మాంద్యం) సమస్యతో బాధపడుతున్న ఒక 35 ఏళ్ల మహీళ థైరాక్సిన్ 50 mcg మందును తీసుకొనేది కాని ఆమెకు ఈ చికిత్స ద్వారా ఉపశమనం కలుగలేదు. దీని కారణంగా ఆమెకు అలసట మరియు చికాకు ఎక్కువగా కలుగుతూ ఉండేవి. గత ఒక సంవత్సరం నుండి ఆమె యొక్క ఋతుచక్రం ఏడు నుండి పది రోజులు వాయిదా పడేది. ఈ సమస్యకు అల్లోపతి చికిత్స తీసుకుంది కాని ఆమె సమస్య తీరలేదు. 2015 జులై 16 న ఆమె వైబ్రో చికిత్సా నిపుణులను చికిత్స కొరకు సంప్రదించింది. ఆమెకు క్రింది మందులు ఇవ్వబడినాయి:
హైపోథైరాయిడిజం సమస్యకు:
#1. CC6.2 Hypothyroid…TDS
అక్రమమైన ఋతుచక్రం సమస్యకు :
#2. CC8.1 Female tonic + CC8.4 Ovaries & Uterus + CC8.8 Menses irregular + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic…TDS
వైబ్రో చికిత్స ప్రారంభించిన తర్వాత కొంత రోగి యొక్క ఋతుచక్రం లో కొంత మెరుగుదల ఏర్పడింది. ఆపై ఆమె యొక్క ఋతుచక్రం సక్రమంగా మొదలైందని ఆమె సెప్టెంబర్ 10న తెలిపింది. ఆపై #2 మందు యొక్క మోతాదు BD కి మరియు సమస్య పూర్తిగా నయమైన కారణంగా 2015 నవంబర్ నెలాఖరుకి OD కి తగ్గించబడింది. 2015 డిసెంబర్ 25 న #2 మందు పూర్తిగా ఆపబడింది.
వైబ్రో చికిత్స తీసుకుంటున్న సమయంలో రోగి థైరాక్సిన్ 50 mcg తీసుకోవడం కొనసాగించింది. థైరాయిడ్ పరీక్ష ద్వారా ఆమె థైరాయిడ్ యొక్క క్రియాశీలత మెరుగుపడిందని తెలిసి వైద్యుడు థైరాక్సిన్ మాత్ర యొక్క మోతాదును 25 mcg చేయడం జరిగింది. ఆ తర్వాత థైరాక్సిన్ మాత్రను ఆపమని ఆమెకు సలహా ఇవ్వబడింది. ఆమె 2016 ఏప్రిల్ 1 న థైరాక్సిన్ ను తీసుకోవడం ఆపింది కానీ వైబ్రో #1 మందును తీసుకోవడం కొనసాగించింది. 2016 జూన్ 13న చేయబడిన రక్త పరీక్ష ద్వారా TSH స్థాయి సరిహద్దుల్లో ఉన్నట్లుగా తెలిసింది. #1 మందును TDS మోతాదులో తీసుకోవడం జరుగుతోంది.
2016 జూన్ నాటికి ఈమె యొక్క ఋతుచక్రం సక్రమంగా కొనసాగడమే కాకుండా ఈమె యొక్క శక్తి పెరగడంతో ఆనందంగా ఉంది.