ఎఫిడ్స్/ క్రిమిబాధితత్వం 00512...Slovenia
2013 వసంతకాలంలో చికిత్సా నిపుణుల యొక్క తోటలో 70 ఆపిల్ చెట్టుల ఆకులు క్రిమిభాధితమయ్యాయి. SRHVP మశీనును ఉపయోగించి వైబ్రో మందును ప్రసారం చేయడం ద్వారా భాధితమైన చెట్టులకు వేగంగా చికిత్సను అందించవచ్చని చికిత్సా నిపుణురాలు నిర్ణయించుకుంది. విట్నెస్ (సాక్షి) రూపంలో ఉపయోగపడేందుకు ఆమె కొన్ని క్రిమిభాధిత ఆకులను ఏరుకొని ఒక చిన్న సంచిలోకి తీసుకొని మశీనులో పెట్టింది.
క్రింది కార్డును మశీనులో తగిన జాగాలో పెట్టింది:
SR315 Staphysagria...continuous
రెమెడీ వెల్ లో విట్నెస్ ను పెట్టిన తర్వాత 200C పొటెన్సీ లో మందు యొక్క ప్రసరణ ను ప్రారంభించింది. రెండో రోజుకే క్రిములు తెల్లటి పొడిగా మారడం ప్రారంభమయింది. మూడు రోజులలో ఆకులపై ఏర్పడిన తెల్లటి పొడి రాలిపోయింది. ఇందువలన మూడు రోజుల తర్వాత ఆమె మందు ప్రసరణను ఆపింది. క్రిములు తిరిగి రాలేదు. ఇదే మందును చికిత్సా నిపుణురాలు గులాబీ మొక్కలపై ఉపయోగించి అద్భుతమైన ఫలితాలను పొందింది.