తీవ్రమైన ఆమ్లతత్వం (అసిడిటీ) 10355...India
2015 మే 15వ తేదీన, వైబ్రియోనిక్స్ అభ్యాసకుడు, 52 ఏళ్ల మహిళకు తీవ్ర ఆమ్లత్వానికి చికిత్స చేసారు. గతనెల రోజులుగా, రోగి అజీర్ణం, కడుపుబ్బరం, ఆకలి లేకపోవుట, అపానవాయువులతో బాధపడుతున్నారు. ఆమె ఎంటాసీడ్ మాత్రలు తీసుకున్నప్పటికీ బాధలలో మార్పులేదు. రోగితో మాట్లాడుతున్నప్పుడు, ఆమె తనజీవితంలో భాగమైన ఎవరివలననో తీవ్రంగా బాధపడుతున్నట్లు అభ్యాసకుడుతెలిసుకొని ఈ క్రింది రెమిడీ ఇచ్చారు:
CC4.10 Indigestion + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...QDS
వైబ్రియోనిక్స్ ప్రారంభించినప్పుడు రోగి ఎంటాసీడ్ తీసుకోలేదు. ఒక వారంలోనే, ఆమె రోగలక్షణాలన్నీ కనీసం 30% తగ్గినట్లు చెప్పారు. 4 వారాల తర్వాత, 90% తగ్గి, ఆమెకు 2నెలల్లో పూర్తిగా బాధలన్నీ తగ్గిపోయినవి. అప్పుడు మోతాదు క్రమంగా క్రింది విధంగా తగ్గించారు. QDS 4వారాలు, తరువాత TDS 2నెలలు, చివరగా OD 2నెలలు యిచ్చారు. రోగి పూర్తి ఆరోగ్యవంతురాలైనది. నవంబర్ 2015 వరకు తిరిగి ఆ వ్యాధుల లక్షణాలేమీ తిరిగి రాలేదు.