మధుమేహపు గాంగ్రీన్ 02786...Russia
19 మార్చి 2015 న ఆసుపత్రిలో తనమిత్రుడిని చూడడానికి అభ్యాసకుడు వెళ్ళినప్పుడు, మధుమేహం వల్ల కలిగే అనేక సమస్యలతో బాధపడుతున్న 72 ఏళ్ల మహిళను కలుసుకున్నారు. రోగిని స్ట్రోక్ తర్వాత ఆమె గ్రామంనుండి ఆసుపత్రికి తెచ్చారు. ఆమెకు మధుమేహం ఎంతకాలంగా వున్నదో వైద్యునికి చెప్పలేకపోయింది. కానీ తనకి మధుమేహం చాలాఎక్కువగా ఉండి, చాలాకాలంనుండి ఇన్సులిన్ వాడుతున్నానని తెలిపారు. మధుమేహం వలన ఆమెకు మూత్రపిండ వైఫల్యం, రెటీనా దెబ్బ తినడంవల్ల దాదాపు అంధత్వం కలిగినవి. ఆమెకు మధుమేహంవల్ల గాంగ్రీన్ వచ్చి 2పాదాలు, మోకాళ్ళలో రక్తప్రసరణ బాగా తగ్గిపోయి, చర్మం ముదురు గోధుమరంగుతో చెట్టు బెరడులా తయారై, ముట్టుకుంటే చాలా పెళుసుగా వున్నది. ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ఆమె పాదాలకు తక్షణమే శస్త్రచికిత్స అవసరమని ఆమెకు చెప్పారు. స్ట్రోక్ చికిత్స ముగిసిన నెలతరువాత ఆమెకు శస్త్రచికిత్స నిర్ణయించినారు. ఆమె శస్త్రచికిత్స తీసుకోలేనంత అనారోగ్యంగా వుంది. అభ్యాసకుడుఈ క్రింది పరిహారాన్ని నూనెతో కలిపి తీసుకువచ్చారు:
#1. СС3.7 Circulation + СС21.11 Wounds & Abrasions…BD పైన పూయటానికి మాత్రమే. వైద్యుడు రోగి పాదాలు 2గంటల పాటు ప్రతి ఉదయం, సాయంత్రం 15-20 నిమిషాలకొకసారి పరిహారం కలిపిన తైలంతో మర్దనా చేసారు. మొదటి 2గంటల తరువాత, రోగి తన కాళ్లు మెరుగయినట్లు చెప్పారు. వైద్యుడి చికిత్సతో, కాళ్ళు రోజుకి రోజు మెరుగుపడి, కొన్నిరోజుల తరువాత రోగి ఆసుపత్రి నుండి పంపబడినది. తైలంలో # 1. తో పాటు, నోటిద్వారా తీసుకొనుటకు క్రింది ఏమిడి ఇవ్వబడింది:
#2. NM6 Calming + NM20 Injury + NM25 Shock + NM32 Vein-Piles + NM81 Glandular Fever + OM3 Bone Irregularity + SM15 Circulation + SM17 Diabetes + SM26 Immunity + SM27 Infection + SR264 Silicea 200C + SR298 Lachesis 30C + SR325 Rescue + SR408 Secale Corn + SR457 Bone + SR507 Lymphatic Organ…6TD నెలవరకు వాడాలి, ఆ తరువాత TDS కొనసాగించాలి.
అప్పటి నుండి అభ్యాసకుడు ఫోన్ ద్వారా మాత్రమే ఆమెతో మాట్లాడేవారు. నెల తర్వాత కాళ్ళ రంగు బాగా మారి, శస్త్రచికిత్స రద్దు చేయబడింది. 3 నెలల తర్వాత, కాళ్లు మామూలురంగుకి మారినవి. వైద్యుడు ఆమెకు 15 నవంబర్ 2015 న ఫోన్ చేసినప్పుడు, ఆమె తన కాళ్లు పూర్తిగా కోలుకున్నట్లు నివేదించారు. ఆమె యింట్లో నడుస్తూ, మామూలుగా తన గృహకృత్యాలన్నిటినీ చేసుకుంటున్నారు.