మెడ, భుజాలలో దీర్ఘకాలిక నొప్పి 01339...USA
మార్చి 2014 లో, 42 సం.ల చేతులతో చికిత్స చేసే అభ్యాసకుడు (హాండ్స్-ఆన్ హీలర్), గత 10 ఏళ్లుగావున్న మెడ, భుజం నొప్పికి సహాయం కోరిరి. అతనికి మెడలో విరుగుతున్నట్లు నొప్పి మొదలై, భుజం పైభాగంలోకి దిగి రెండుభుజాల కీళ్లకలయిక వద్ద ఎక్కువవుతున్నది. భరించలేనినొప్పి వల్ల తనరోగులకు చికిత్సచేసే శక్తి పోతోంది. అతను వివిధ శరీరనిర్మాణ చికిత్సలను ప్రయత్నించాడు. కైరోప్రాక్టిక్ చికిత్సవల్ల తగ్గలేదు. అక్యుపంక్చర్, మసాజ్ థెరపీ నొప్పి తగ్గించినా, అది కొద్దికాలం మాత్రమే. కొన్ని వారాలవరకు లేదా కొన్ని నెలల వరకు నొప్పిని తగ్గించి, మళ్ళీ ముంచుకు వస్తుంది. అభ్యాసకుడు రోగికి ఈ క్రింది పరిహారాన్ని పంపించారు:
CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue…QDS
6 నెలలయేక, 24 సెప్టెంబర్ 2015 న, అభ్యాసకునికి రోగినుండి తన నొప్పి పూర్తిగా కొన్ని వారాల వైబ్రియోనిక్స్ చికిత్స తర్వాత పూర్తిగా తగ్గిపోయి, తిరిగి నొప్పి రాలేదని' ఎలెక్ట్రానిక్ మెయిల్ అందినది. (దిగువ చూడండి).
రోగి యొక్క ఇ-మెయిల్:
"మీరు ఆలస్యంగా నాకు గుర్తువచ్చారు. మీరు నాకు 2014లో పంపిన గుళికల తొలిసీసాని ముగించేముందే, నానొప్పి పూర్తిగా పోయిందని మీకు, నేను రాయాలనుకున్నాను. వైబ్రియోనిక్స్ నాకెంత బాగా పనిచేసిందో, మీసహాయాన్ని నేనెంత అభినందిస్తున్నానో తెలుపుటకు నేను చాలాకాలం క్రితమే మీకు వ్రాయవలసింది. మీ చక్కని సేవానిరతికి నాధన్యవాదాలు. మాకోసం మీద్వారా పని చేసినందుకు స్వామికి నా కృతజ్ఞతలు. మీకు అనేక కృతజ్ఞతలు. సాయి రామ్!"