దీర్ఘకాలిక చర్మరోగం, మధుమేహం (2వ రకం), నీరూరే కళ్ళు 02799...UK
గత 20 సం.లు.గా తీవ్రమైన చర్మవ్యాధితో బాధపడుతున్న ఒక 59 ఏళ్ల వ్యక్తి, 11 జూన్ 2014 న చికిత్సకై వచ్చారు. అతని కాళ్ల మీద చర్మం నల్లగా, మొద్దుగా, పెచ్చులుకట్టి ఉంది; ఇది అతనికి చాలా బాధ కలిగించింది. అతను డాక్టర్లు చెప్పిన స్టెరాయిడ్ క్రీములు క్రమం తప్పకుండా, వాడినా పెద్ద ప్రయోజనం కలగలేదు. రోగి గత 12ఏళ్ళుగా తనకున్న 2వ రకం మధుమేహంకోసం చికిత్సపొందుతున్ననూ, అల్లోపతిమందుల ద్వారా (మెట్రినిన్, గ్లిక్లాజైడ్) నయమవలేదు. అదేకాక, గత 1½ సం.లు, అతను కళ్ళలో కారుతున్న నీటితో బాధపడుతున్నాడు. అతను దానికోసం కళ్లలో చుక్కలు ఉపయోగిస్తున్నా, పరిస్థితి మెరుగవలేదు. మధుమేహం కోసం అల్లోపతిమందులు తప్ప, రోగి మరే మందులు వాడటంలేదు. అతనికి ఈ క్రింది సంబంధ మిశ్రమాలతో చికిత్స చేయబడినది:
చర్మవ్యాధికొరకు:
#1. CC21.1 Skin tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.6 Eczema + CC21.10 Psoriasis…QDS నెలవరకు, తర్వాత TDS. అదనంగా, చర్మంపైన పూయుటకు, ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ నూనెలో అదే మిశ్రమాన్ని కలిపి ప్రతిరోజూ ఉదయం, అవసరమైతే దురదకోసం రోజంతా రాయాలి.
మధుమేహంకొరకు:
#2. CC6.3 Diabetes + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic…QDS నెలవరకు, తర్వాత TDS
నీళ్ళూరే కళ్ళకొరకు:
#3. CC7.1 Eye tonic + CC7.3 Eye infections + CC7.4 Eye defects…QDS నెలవరకు, తర్వాత TDS
రోగికి మధుమేహం నియంత్రణలో ఆహారం, వ్యాయామం యొక్క ప్రాముఖ్యత, చర్మవ్యాధిమంటలో ఒత్తిడిప్రాముఖ్యత గురించి సలహా ఇవ్వబడినది. 6వారాల చికిత్సతర్వాత, రోగలక్షణాలలో మెరుగును వివరించగా, క్రిందివిధంగా మోతాదులు సర్దుబాటు చేయబడ్డాయి:
- చర్మవ్యాధి 30% మెరుగుపడింది. #1 కొనసాగింది TDS.
- అతని మధుమేహం, ఇప్పుడు తన అల్లోపతిమందులతో పాటు #2 వాడగా నియంత్రణలో వుంది. #2 TDS కొనసాగింది.
- అతనికళ్లు 100% మెరుగయి, నీళ్ళు కారటంలేదు. #3 ఒక వారంపాటు BD కి తగ్గించబడింది, తరువాత OD ని ఆపేముందు మరొక వారం కొనసాగించాలి.
చర్మవ్యాధి నిరంతర చికిత్సవల్ల మెరుగవసాగింది. 3 నెలల తరువాత, రోగి 50% మెరుగుదల, 9వ నెల చివరికి (మార్చి 2015), 70% మెరుగుదలను నివేదించారు. చర్మం గట్టిపడటం బాగా తగ్గి, చర్మంరంగు మారి, దాని సాధారణ రంగులోకి తిరిగి వచ్చింది.
అక్టోబరు 10, 2015 న చూసినప్పుడు, రోగి చర్మవ్యాధిలో 95% మెరుగుదలని నివేదించారు. చర్మం మొద్దుతనం, నలుపు బాగా తగ్గి దాదాపు సాధారణంగా కనిపించింది. అతని మధుమేహం బాగా నియంత్రించబడింది. అక్టోబర్ 2015 నాటికి, కృతజ్ఞుడైన రోగి అవసరమైతే బయట పూయటానికి #1 BD ని తీసుకెళ్లినాడు. అతను #2 TDS ను కొనసాగిస్తున్నాడు.