రెటీనైటీస్ పిగ్మెంటోసా, భయతీవ్రత (Panic attacks), అజీర్ణం 02802...UK
ఫిబ్రవరి 1, 2015న 65 ఏళ్ల వ్యక్తి , జన్యుపరంగా వచ్చిన కంటివ్యాధి రెటీనైటీస్ పిగ్మెంటోసా (RP) చికిత్సకై వచ్చారు. అతను 15వ సం.నుండి చట్టపరంగా అంధుడిగా పరిగణించ బడేవాడు. కాలక్రమంగా అతని దృష్టి క్షీణించింది. ఇప్పుడు అతను నలుపు, బూడిద రంగులని లీలమాత్రంగా చూడగలరుకానీ మిగతా రంగులేవీ చూడలేరు. అతను గ్యాస్, అధిక కొలెస్ట్రాల్ (6.2 mmol / L) వీపునొప్పితో బాధపడుతున్నారు. అతను కోపంతో, నిరాశగా వున్నారు. రోగి కొలెస్ట్రాల్ కి స్టాటిన్ ఔషధాన్ని సూచించినా, రోగి తీసుకొనలేదు. అతనికి క్రింది వైబ్రియోనిక్స్ కాంబో ప్రారంభించారు:
#1. CC3.7 Circulation + CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC4.10 Indigestion + CC7.1 Eye tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.4 Muscles + CC20.5 Spine…TDS
10 రోజుల తర్వాత అభ్యాసకుని వద్దకు వచ్చినప్పుడు, రోగి తనకు చాలా ఆందోళనగా వున్నదని తెలిపారు. తనకి రాత్రిళ్ళు తీవ్ర భయాందోళనలతో నిద్ర సరిగ్గా పట్టదని, తనదృష్టి పూర్తిగా పోతుందేమోనని చాలా భయమని చెప్పారు. అతని చికిత్స క్రింది విధంగా మార్చబడింది:
మానసిక, భావావేశ లక్షణాలకు:
#2. NM6 Calming + NM25 Shock + NM95 Rescue Plus + SM39 Tension... hourly until better, then gradually reduce to OD.
దృష్టి బాగుపడుటకు:
#3. NM96 Scar tissue + NM72 Cleansing + OM25 Eye Retina + SR455 Artery + SR477 Capillary + SR526 Retina + SR539 Vein …TDS
పైవిధంగా మార్చడంతో అతని మానసికస్థితి వేగంగా మెరుగయింది. # 2 తీసుకున్న 3రోజుల్లో ఆందోళన, తీవ్ర భయాందోళనలు 75% తగ్గినవి. 7రోజుల్లో రోగలక్షణాలన్నీ పూర్తిగా పోయాయి. 3నెలల చికిత్సతరువాత (4 మే 2015) తనదృష్టి 50% బాగయినట్లు భావించారు. అతను ఇప్పుడు కొన్నిరంగులు, కొంతవరకు ముఖాలను చూడగల్గుతున్నారు. అతను తన జీర్ణ సమస్యలు, అధిక కొలెస్ట్రాల్ కు చికిత్స నిమ్మని అడిగారు. అతను వైబ్రో నివారణలు తప్ప, ఏ యితర మందులు తీసుకోలేదు. అభ్యాసకుడు కాంబోను ఈవిధంగా మార్చారు:
#4. NM21 KBS + NM22 Liver + NM29 SUFI + BR20 Eye + SR216 Vitamin E + SR480 Cholesterol + SR561 Vitamin Balance + #3…TDS
23 సెప్టెంబర్ 2015 న రోగి సందర్శనలో తనకు బాగా మెరుగైనదని చెప్పి, వైబ్రోచికిత్స కొనసాగించడంలో ఆసక్తి చూపారు. అతని మానసిక ఆందోళన పూర్తిగా పోయింది. అతని కడుపులో వాయువు సమస్య 75%, అతని దృష్టి 60% మెరుగైనవి. అతను ప్రస్తుతం మరిన్ని రంగులు, అస్పష్టంగా బాహ్యరేఖలను చూడగలుగు తున్నారు. అతను భవిష్యత్ గురించి ఆశాజనకంగా భావిస్తున్నారు. అక్టోబర్ 2015 నాటికి, అతను కొలెస్ట్రాల్ స్థాయి తెలుసుకోవడానికి రక్తపరీక్ష కోసం ఎదురుచూస్తున్నారు. అతను కంటిడాక్టర్ వద్ద తనిఖీకి వెళ్లనున్నారు. వైబ్రోవైద్యుని కోరిక ప్రకారం, డాక్టరు రెటీనాలో వచ్చిన మార్పులను తనిఖీ చేస్తారు.