కీళ్ళ వాపులు 02817...India
అభ్యాసకుడు వ్రాసినది: మేము విజయవంతంగా నయంచేసిన వ్యాదులలో కీల్లవాపు ఒకటి. నేను ఇంతకముందు ఈ సమస్యతో భాద్ధపడ్డాను కనుక ఈ భాద ఎలావుంటుందో ఊహించగలను. ఈ సమస్యకి మందు తయారు చేస్తునప్పుడల్లా భగవంతుడు నాదేగ్గరే ఉన్నట్లు అనిపిస్తుంది.
ఒక 49 ఏళ్ళ మహిళ ఏడేళ్ళగా భాదపడుతున్న కీళ్ళ వాపుల సమస్యవల్ల నన్ను సంప్రదించింది. ఆమెకు మోకాళ్ళు,మోచేతులు మరియు భుజాలలొ నొప్పి తీవ్రంగా ఉండేది. దీనివల్ల ఆమెకు నిద్రపట్టక నీరసంగా ఉండేది. ఆమె వైద్యుడు ఆమెకు రుమటాయిడ్ కీళ్ళ వాపులని చెప్పారు. ఆమె మోకాళ్ళ మీద ఇంజక్షన్లు వేయించుకోవడంతోపాటు రోజుకి రెండు పారసిటమాల్ మాత్రలు వేసుకునేది. ఆపై ఆయుర్వేద తైలాన్నికూడా రాసుకునేది. ఆమె వైద్యుడు ఆమెకు శస్త్ర చికిత్స చేయాలని చెప్పడంతో ఆమె భయపడి నన్ను వై బ్రో మందులు కొరకు సంప్రదించింది. ఆమెకు ఈ క్రింద వ్రాసిన మందులు ఇవ్వబడినాయి
CC3.7 Circulation + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue...TDS
పదిహేను రోజుల తరవాత ఆమెకు కీళ్ళ వాపుల సమస్య 70% నయమైందని మళ్ళి మందులు నిమ్పించుకుని వెళ్ళింది. ఆమె పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం మానేసి హాయిగా నిద్రించగలిగింది. రెండు నెలల తరువాత ఆమెకు నొప్పి పూర్తిగా తగ్గింది కాని కొద్దిగా అసౌకర్యం ఉండేది. నాలుగు నెలల తరవాత అదికూడా తగ్గి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందింది.
ఈ కేసు గురించి సంక్షిప్తంగా 2014 అంతర్జాతీయ కాన్ఫరంస్ బుక్లో రాయబడియుంది.