భావోద్వేగ ఒత్తిడి 00437...India
చక్కని వ్యక్తిత్వము, క్రమశిక్షణ కలిగిన 49 ఏళ్ల వడ్రంగి మేస్త్రి అనుకోకుండా మారిపోయి ఆత్రుత, చెదిరిన మనసు గల వ్యక్తిగా మారిపోయి తన పనిని కూడా చేసుకోలేక పోతున్నాడు. కొద్దికాలం కిందట అతని అన్న అనారోగ్యం వల్ల మరణించాడని ఆయన తెలిపాడు. తన కుటుంబంతో పాటు తన అన్న కుటుంబాన్ని కూడా ఇతను చూసుకోవలసి వస్తోంది. దానివలన ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. దీనికితోడు, గత నెల రోజులుగా ప్రతీ రాత్రి అతని అన్న కలలో కనిపించి కాళ్ళ వైపు నిలబడి ఏడుస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది. దీనివల్ల అతనిని భయంతో నిద్ర రావడం లేదు. ఇది అతనిని మానసికంగా అస్థిరంగా భావోద్వేగ పరంగా తట్టుకోలేని విధంగా చేస్తోంది. అతని ఆరోగ్యం కూడా పాడయ్యింది. అతనికి క్రింద ఇవ్వబడింది:
NM6 Calming + NM28 Sleep + NM83 Grief + SM1 Removal of Entities + SM2 Divine Protection + SM41 Uplift…TDS
అతను బాబా భక్తుడు కావడాన ప్రతిరోజు విభూతి ధరించమని, నీళ్ళలో కలుపుకొని నిద్రపోయేముందు తాగమనీ, బాబా ఫోటో ను అతని మంచం మీద తలక్రింద పెట్టుకొని పడుకోవలసిందిగా సలహా ఇవ్వబడింది. త్వరలోనే అతనికి తన అన్న కలలో కనిపించడం తగ్గిపోయింది. అతను క్రమంగా ఆరోగ్యంగా తయారయ్యాడు. నెల రోజుల్లోనే, అతను తిరిగి సాధారణ వ్యక్తిగా మారిపోయాడు.