Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

చేతుల్లో నొప్పి, మొద్దుబారడం (నంబ్నెస్), GERD (గ్యాస్ట్రో-ఈసోఫేజియల్ రిఫ్లక్స్ వ్యాధి) 18009...भारत


46 సంవత్సరాల వయస్సు గల ఒక పురుషుడు 2021 నుండి, అంటే గత నాలుగు సంవత్సరాలుగా, చేతుల్లో జలదరింపు, రాత్రి వేళల్లో మొద్దుబారడం, అలాగే మణికట్టుల్లో ఎడతెగని నొప్పితో బాధపడుతున్నాడు. అధిక శారీరక ఒత్తిడి లేదా ఎక్కువ పని చేసినప్పుడు ఈ లక్షణాలు మరింత తీవ్రమయ్యేవి. అతని ఉద్యోగంలో నిరంతరంగా మరియు పునరావృతంగా లీవర్లతో (levers) పని నిర్వహించాల్సి ఉండటం వల్ల ఈ సమస్య అతనికి మరింత ఆందోళన కలిగించేది.

  అదనంగా, 2023 జనవరి నుండి, అంటే గత రెండు సంవత్సరాలుగా, భోజనం చేసిన తరువాత పొత్తికడుపులో మంటను కూడా అనుభవిస్తున్నాడు. దీనికి తోడు రోజంతా గ్యాస్ వలన త్రేనుపులు సమస్య కూడా ఉండేది. షిఫ్ట్ విధుల్లో పనిచేయడం వల్ల అతని భోజన సమయాలు క్రమబద్ధంగా ఉండేవి కావు. తరచుగా బయట ఆహారం తీసుకునే అలవాటు కూడా ఉండేది. ప్రారంభంలో ఈ అజీర్ణ సమస్యలు వారానికి రెండు మూడు సార్లు వస్తు మజ్జిగ తీసుకోవడం ద్వారా తగ్గిపోయేవి.  కానీ గత ఎనిమిది నెలలుగా కడుపులో మంట భోజనం చేసిన ప్రతిసారి రావడం మొదలై మజ్జిగ తాగిన కూడా తగ్గని పరిస్థితి ఏర్పడింది. అంతేకాక అతని పేగు కదలికలలో కూడా ఇబ్బంది ఏర్పడి దుర్వాసనతో కూడిన వాయువు రావడం ప్రారంమైనట్లు కూడా తెలిపాడు. అతను ఎటువంటి అల్లోపతి మందులు స్వీకరించక యోగా ద్వారా తన పరిస్థితి క్రమబద్ధం చేసుకోగలుగుతున్నారు 8 మార్చి 2025, 2025 మార్చి 8న, తన యోగా తరగతులలో పరిచయమైన ఒక వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ ను సంప్రదించగా, అతనికి ఈ క్రింది రెమిడీ ఇవ్వబడింది:

#1. CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC12.1 Adult tonic…6TD

#2. CC3.7 Circulation + CC10.1 Emergencies + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.5 Spine + CC20.7 Fractures + Bitter leaf* Potentised 1M…6TD

అదనంగా, ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవాలని, ముఖ్యంగా ఆకుకూరలు మరియు మజ్జిగను ఆహారంలో చేర్చాలని, అలాగే బయట ఆహారం తినకుండా ఉండేందుకు ఇంటి నుండి భోజనం తీసుకెళ్లాలని ఆయనకు సూచించబడిందితదుపరి కొన్ని వారాల పాటు, తన తండ్రి ఆసుపత్రిలో చేరడంతో ఆయన యోగా తరగతులకు హాజరు కాలేకపోయారు. అందువల్ల ఆ కాలంలో చికిత్సకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

చికిత్స పురోగతి:

Ø  1 జూన్ 2025: అన్ని లక్షణాలలో 100% ఉపశమనం లభించింది. మందు మోతాదును TDS కు తగ్గించారు.

Ø  1 జులై 2025: మోతాదును OD (రోజుకు ఒకసారి) కి తగ్గించడం జరిగింది.

Ø  25 ఆగస్టు 2025: మోతాదును క్రమంగా తగ్గిస్తూ మందులను పూర్తిగా నిలిపివేశారు.

2025 డిసెంబర్ నాటికి, సమస్యలు మళ్లీ తిరిగి రాలేదు. రోగి ప్రస్తుతం ఆరోగ్యకరమైన ఆహారం మరియు యోగా సాధనతో సమతుల్యమైన జీవనశైలిని ఆనందంగా కొనసాగిస్తున్నారు.

* దీని వృక్షశాస్త్రీయ నామం వెర్మోనియా ఎమిగ్డలిన