అరికాలి కండర పట్టీ వాపు 03623...Zimbabwe
ప్రాక్టీషనర్‌కు స్నేహితురాలైన 39 ఏళ్ల మహిళకు మార్చి 2023 నుంచి కుడి పాదం మొత్తం, అలాగే ఎడమ పాదంలోని ఒక వేలు ఎముకలో నొప్పి బాధిస్తోంది. మొదట్లో నొప్పి అప్పుడప్పుడు మాత్రమే వచ్చేది; సుమారు ఒక గంట విశ్రాంతి తీసుకున్న తర్వాత తగ్గిపోయేది. అయితే, గత ఆరు నెలలుగా నొప్పి క్రమంగా తీవ్రమైంది. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఆమెకు తీవ్రమైన నొప్పి ఉండేది. ఆ నొప్పి రోజంతా కొనసాగుతూ, నడిచేటప్పుడు లేదా నిలబడేటప్పుడు మరింత ఎక్కువయ్యేది. ఆమె ఉద్యోగంలో తరచుగా నిలబడటం, నడవడం అవసరం కావడంతో, పాదాలపై ఒత్తిడి తగ్గించుకోవడానికి పాదాల బయటి అంచులపై బరువు వేస్తూ, బాతు నడకలా నడవడం ప్రారంభించారు. అయినప్పటికీ, గణనీయమైన అసౌకర్యం లేకుండా ఆమె 15 నిమిషాలకు మించి నడవలేకపోయేవారు.
జూన్ 2023లో ఒక డాక్టర్ పరీక్షించి నొప్పి, కండరాలకు సంబంధించినదని నిర్ధారించి, 10 రోజుల పాటు నొప్పి నివారణ మందులు తీసుకోవాలని సూచించారు. అయితే ఆమె ఆ మందులు తీసుకోకూడదని బదులుగా, మర్దన చేసుకోవడం, గోరువెచ్చని నీటిలో పాదాలను పెట్టడం, అలాగే పాదాలపై ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడటం వంటి వాటిపై ఆధారపడ్డారు. అయినప్పటికీ, ఆమెకు ఇష్టమైన అనేక కార్యకలాపాలను వదులుకోవాల్సి వచ్చింది. వాటిలో బ్యాడ్మింటన్ ఆడటం, పిల్లలతో కలిసి ఆడే తాడు ఆట కూడా ఉన్నాయి. 24 డిసెంబర్ 2024న ప్రాక్టీషనర్ ఆమెకు ఈ క్రింది రెమెడీలను ఇచ్చారు:
#1. CC20.2 SMJ pain…TDS
#2. IB…OD ఉదయం నిద్రలేచిన వెంటనే వేసుకోవడానికి (vol 15 #2)
చికిత్స పురోగతి:
Ø 26 జనవరి 2025: నొప్పిలో 60% మెరుగుదల. ఇప్పుడు 30–40 నిమిషాలు నొప్పి లేకుండా సాధారణంగా నడవగలిగారు.
Ø 15 మార్చి 2025: నొప్పిలో 75% మెరుగుదల. నడవడం లేదా నిలబడడం మరింత సౌకర్యంగా అనిపించింది. రోగి #2ను నిలిపివేశారు.
Ø 19 ఏప్రిల్ 2025: నొప్పి దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. తనకు ఇష్టమైన క్రీడలను మళ్లీ ఆడటం ప్రారంభించారు. అప్పుడప్పుడు స్వల్ప నొప్పి చల్లని వాతావరణం కారణంగా వచ్చేది; 30 నిమిషాల విశ్రాంతితో అది తగ్గిపోయేది.
Ø 10 మే 2025: నొప్పి పూర్తిగా లేకుండా పోయింది. #1ను BDకి తగ్గించారు.
Ø 20 మే 2025: మోతాదును క్రమంగా తగ్గించిన తరువాత రెమెడీని నిలిపివేశారు.
9 ఆగస్టు 2025 నాటికి, ఆమె నొప్పి లేకుండా ఉన్నారు. సాధారణ ఆరోగ్యం కోసం ప్రస్తుతం CC12.1 Adult tonic…TDS తీసుకుంటున్నారు
రోగి మాటల్లో:
2023 నుంచి నేను ప్లాంటార్ ఫాసియైటిస్‌తో బాధపడుతున్నాను. నా స్నేహితురాలి ద్వారా వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్నాను. నేను 15 నిమిషాల కంటే ఎక్కువ నడవలేకపోయేదాన్ని, గెంతడం కూడా సాధ్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడు నేను సులభంగా ఒక గంట పాటు నడవగలను, తాడుతో గెంతగలను. నా ఫలితాల పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ రెమెడీలకు కృతజ్ఞతలు, ఎందుకంటే ఇప్పుడు నేను మళ్లీ సాధారణ జీవితాన్ని ఆనందించగలుగుతున్నాను.