Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

సంతానలేమి 11618...India


ఒక జంట (2020 నాటికి మహిళ వయసు 40 సంవత్సరములు మరియు భర్త వయసు 45 సంవత్సరములు)  2004లో వివాహం జరిగినప్పటి నుంచి 16 సంవత్సరాలుగా సంతానం కోసం ప్రయత్నిస్తున్నారు. వారు ఎప్పుడూ ఎలాంటి గర్భనిరోధక పద్ధతులను ఉపయోగించలేదు. భార్యకు జనవరి 2011 వరకు నెలసరి సక్రమంగా, క్రమం తప్పకుండా వచ్చేది. ఆ సమయంలో ఆమెకు ఎక్కువ రోజులు కొనసాగే అధిక రక్తస్రావంతో కూడిన నెలసరి సమస్య ప్రారంభమైంది. పరీక్షల అనంతరం ఆమెకు హైపోథైరాయిడిజం మరియు ఎండోమెట్రియోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆమెకు థైరాయిడ్ మందులు సూచించడంతో పాటు లాపరోస్కోపీ నిర్వహించారు. ఒక నెలలోనే రక్తస్రావం సాధారణ స్థితికి వచ్చింది, అయితే నెలసరి క్రమబద్ధంగా మాత్రం కొనసాగలేదు.  మరో మూడు సంవత్సరాలు గడిచినా గర్భధారణ జరగకపోవడంతో, 2014లో వారు ప్రత్యేక వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వాటిలో భార్య అండాల నాణ్యత తక్కువగా ఉందని, భర్తకు వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు వాటి నాణ్యత కూడా సరిగా లేదని తేలింది. ఈ సంవత్సరాలన్నింటిలో వారు భారతదేశంలోనూ, విదేశాల్లోనూ అనేక మంది వైద్యులను సంప్రదించారు. అయినప్పటికీ, 2017 నుంచి 2019 మధ్య చేసిన మూడు IVF (టెస్ట్ ట్యూబ్ బేబీ) చికిత్సలతో సహా అన్ని చికిత్సలు విఫలమయ్యాయి. ఈ కాలం వారిద్దరికీ ఎంతో బాధాకరంగా, నిరాశాజనకంగా గడిచింది.

2020లో వారు ప్రాక్టీషనర్‌ను సంప్రదించారు. ఆ సమయంలో భార్య, ప్రాక్టీషనర్‌తో వ్యక్తిగతంగా మాట్లాడుతూ సంతానం కలగకపోవడం వల్ల కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిడిని, విమర్శలను ఎదుర్కొంటున్నానని ఆమె కన్నీళ్లతో పంచుకున్నారు. ఈ మానసిక ఒత్తిడి కారణంగా ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో ఆమె మరింత కలత చెందారు. అలాగే, రెండు సంవత్సరాలుగా, ఆమె కడుపులో మంటతో బాధపడుతున్నారు. ఈ మంట కొన్ని నిమిషాల పాటు ఉండేది, అయితే ప్రతి 4 నుంచి 5 రోజులకు ఒకసారి తిరిగి వచ్చేది. ఇందుకోసం ఆమె ఎలాంటి చికిత్స తీసుకోలేదు. ఆమె పైకి గంభీరంగా కనిపించినా ఎంతో నిరాశకు లోనైనట్లు కనిపించారు. ఆమె అనుభవిస్తున్న బాధను చూసి ప్రాక్టీషనర్ ఎంతగానో చలించిపోయి, 4 ఆగస్టు 2020న దైవానికి హృదయపూర్వక ప్రార్థనలు చేస్తూ, క్రింది రెమెడీలను సిద్ధం చేశారు:

భార్య కోరకు: CC4.10 Indigestion + CC6.2 Hypothyroid + CC8.1 Female tonic + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders…TDS 

భర్త కోరకు: CC10.1 Emergencies + CC14.1 Male tonic + CC14.3 Male infertility + CC15.1 Mental & Emotional tonic…TDS

చికిత్స పురోగతి: