తోక ఎముక డిస్లోకేషన్ నొప్పి (టైల్ బోన్ డిస్లోకేషన్, పెయిన్) 11618...India
25 సంవత్సరాల వయస్సు గల ఒక యువకుడు 2022 మార్చి 10న బైక్ ప్రమాదానికి గురయ్యాడు. వైద్య పరీక్షల్లో, ప్రమాదం కారణంగా తోక ఎముక (కాక్సిక్స్) తన స్థానాన్ని కోల్పోయి (Dislocation) నిటారుగా మారినట్లు నిర్ధారణ అయింది. వైద్యులు ఈ గాయం 6 నుంచి 12 నెలల్లో సహజంగానే మానిపోతుందని తెలిపారు. నొప్పి తగ్గించడానికి ఆరు నెలల పాటు నొప్పి నివారణ మాత్రలు వాడాలని, అలాగే కూర్చునేటప్పుడు ఒత్తిడి తగ్గించడానికి ప్రత్యేకంగా రూపొందించిన కుషన్ ఉపయోగించాలని సూచించారు.
అయితే, నొప్పి నివారణ మాత్రలను ఎక్కువ కాలం వాడడం వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి ఆందోళన చెందిన రోగి వాటిని తీసుకోలేదు. దీంతో అతనికి కూర్చున్నప్పుడు , ఐదు నిమిషాలు నిలబడినా, కూర్చొని లేచేటప్పుడు, ద్విచక్ర వాహనాన్ని నడిపేటప్పుడు తీవ్రమైన నెప్పి వచ్చేది. ఈ సమస్యల వల్ల అతని చదువు, పార్ట్టైమ్ ఉద్యోగం, డాన్స్ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నొప్పి మరియు కదలికల పరిమితి కారణంగా మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా పెరిగాయి.
అతనికి గతంలో వైబ్రియోనిక్స్ చికిత్స వల్ల మంచి ఫలితాలు వచ్చినందున, అదే ప్రాక్టీషనర్ని సంప్రదించాడు. అదనంగా, గత 5–6 సంవత్సరాలుగా వారానికి ఒకటి లేదా రెండు సార్లు మలబద్ధకం (గట్టి మలం) కూడా ఉంటుందని తెలిపాడు. 23 మార్చి 2022న, అతనికి ఈ క్రింది చికిత్స ఇవ్వబడింది:
CC4.4 Constipation + CC10.1 Emergencies + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC20.7 Fractures…TDS మరియు బాహ్యముగా రాసుకోవడానికి కొబ్బరినూనెలో…BD
చికిత్స పురోగతి:
- 6 ఏప్రిల్ 2022: నొప్పి 50% తగ్గింది. 15–20 నిమిషాల పాటు సౌకర్యంగా కూర్చోగలిగాడు.
- 7 మే 2022: నొప్పి 85% తగ్గింది. 2–3 గంటల పాటు సులభంగా కూర్చోగలిగాడు. మలబద్ధకం కూడా పూర్తిగా తగ్గిపోయింది.
- 20 మే 2022: ఎక్స్-రే రిపోర్ట్ ప్రకారం తోక ఎముక మళ్లీ తన సహజ స్థానానికి మరియు వంపుకు చేరుకుంది. దీంతో రోగి ఎంతో ఆనందించాడు.
- 30 మే 2022: నొప్పి పూర్తిగా తగ్గిపోయింది.
- 30 జూన్ 2022: రెమెడీ మోతాదును BD కు తగ్గించారు. బాహ్యంగా రాసే చికిత్సను నిలిపివేశారు. రోగి మళ్లీ ఎలాంటి అసౌకర్యం లేకుండా డాన్స్ తో సహా తన సాధారణ రోజువారీ పనులను ప్రారంభించాడు.
- 30 ఆగష్టు 2022: మోతాదును క్రమంగా తగ్గిస్తూ చికిత్సను పూర్తిగా నిలిపివేశారు.
2025 జూన్ నాటికి, ఈ నొప్పి మళ్లీ తిరిగి రాలేదు.