పార్శ్వ తలనొప్పి(మైగ్రేన్) 11673...India
38 సంవత్సరాల వయస్సు గల ఒక కుట్టు పనివారు 2021 నుండి గత మూడు సంవత్సరాలుగా తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారు. నొప్పి ఎల్లప్పుడూ తల ఎడమ వైపునే ఉండేది. దానితో పాటు వికారం, వాంతులు, వెలుతురు మరియు శబ్దాన్ని భరించలేని స్థితి కూడా ఉండేది. ఈ తలనొప్పి వారానికి సుమారు మూడు సార్లు వచ్చేది. ఒక్కోసారి రోజంతా మధ్య మధ్యలో కొనసాగుతూ ఉండేది. దాంతో ఆమెకు రోజంతా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చేది. కుటుంబానికి ఏకైక సంపాదనాధారమైన ఆమె నిరంతరం ఆర్థిక, మానసిక ఒత్తిడిలో ఉండేది. అదే తన మైగ్రేన్కు ప్రధాన కారణమని ఆమె భావించేది. కొద్దిసేపు ఎండలోకి వెళ్లినా మైగ్రేన్ దాడి ప్రారంభమయ్యేది. అందువల్ల బయటకు వెళ్లేటప్పుడు ఎల్లప్పుడూ గొడుగు వెంట తీసుకెళ్లేది. తరచూ వచ్చే ఈ తలనొప్పి ఆమె కుట్టు పనితో పాటు ఇంటి పనులను కూడా తీవ్రంగా ప్రభావితం చేసి, ఆమె మానసిక ఆందోళనను మరింత పెంచింది.
2021లో వైద్యులు ఆమెకు మైగ్రేన్ ఉన్నట్లు నిర్ధారించి, ఆవిరి పట్టుకోవాలని సూచించడంతో పాటు నొప్పి నివారణ మాత్రలు ఇచ్చారు. అయితే ఆమె తీవ్రమైన దాడులు వచ్చినప్పుడు మాత్రమే ఆ మాత్రలు వాడేది. వాటివల్ల సుమారు 20 నిమిషాల్లో తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభించేది.
8 ఆగస్టు 2024న ఆమె అలోపతి మందులను నిలిపివేసి వైబ్రియానిక్స్ చికిత్సను ప్రారంభించారు. ప్రాక్టీషనర్ ఈ క్రింది రెమెడీలను ఇచ్చారు:
#1. CC10.1 Emergencies + CC11.3 Headaches + CC11.4 Migraines + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS
#2. IB (from vol 13 #5)…OD
చికిత్స పురోగతి:
Ø 10 సెప్టెంబర్ 2024: ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే మైగ్రేన్ దాడి వచ్చింది. తలనొప్పి, వికారం, వాంతులు 50% వరకు తగ్గాయి. మానసిక ఒత్తిడి కూడా తగ్గినట్లు ఆమె భావించారు. ఇంటి పనులు, కుట్టు పనిని ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించగలిగారు.
Ø 5 నవంబర్ 2024: మైగ్రేన్ దాడులు పూర్తిగా ఆగిపోయాయి. మానసిక ప్రశాంతత, ఉత్సాహం, ఆనందం పెరిగాయి. ఈ స్వస్థతకు స్వామివారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. #1 మోతాదును OD కు తగ్గించి, 8 జనవరి 2025న పూర్తిగా నిలిపివేశారు.
జూన్ 2025 నాటికి, సమస్య పునరావృతం కాలేదు. ఆమె #2 రెమెడీని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.