Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

మలద్వారం చుట్టూ చీము గడ్డ, మలబద్ధకం 11573...India


మలద్వారం సమీపంలో ఏర్పడిన చీము గడ్డ వలన నొప్పితో బాధపడుతున్న 27 ఏళ్ల వ్యక్తి   ప్రాక్టీషనర్‌ను సంప్రదించాడు. ఈ సమస్య రెండు నెలలకు పైగా అతన్ని ఇబ్బంది పెడుతోంది. నొప్పి తీవ్రంగా ఉండటంతో అతని కూర్చునే తీరు, నడక కూడా ప్రభావితమై, నిటారుగా నడవడం కష్టంగా మారింది. మరింత వివరాలలోకి వెళ్ళితే, అతను తగినంత నీరు తాగడం లేదని, గత ఏడాది కాలంగా వారానికి కేవలం మూడు సార్లు మాత్రమే మలవిసర్జన జరుగుతోందని తెలిసింది. అతని మలం గట్టిగా ఉండేది, ఇందుకోసం అతను ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదు.

21 నవంబర్ 2022 :   

CC4.4 Constipation + CC10.1 Emergencies + CC20.1 SMJ tonic…TDS ఇచ్చారు

అదనంగా, రోగి రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీరు తాగేలా పెంచుకోవాలని, అలాగే పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు.

20 డిసెంబర్  నాటికి రోగి చీము గడ్డ పూర్తిగా తగ్గిపోయి నొప్పి తగ్గి పూర్తిగా ఉపశమనం కలిగింది మరియు ప్రతిరోజూ క్రమం తప్పకుండా మలవిసర్జన జరుగుతోంది. 21 జనవరి 2023న మోతాదును BDకి తగ్గించి, ఆ తరువాత క్రమంగా తగ్గిస్తూ, 20 జూన్ న పూర్తిగా నిలిపివేశారు.

ఏప్రిల్ 2025 నాటికి, ఆయన ఎలాంటి బాధ లేకుండా ఉన్నారు; చీము గడ్డ లేదా మలబద్ధకం మళ్లీ ఏర్పడలేదు.