Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

వెర్టిగో, సమతుల్యత కోల్పోవడం 11602...India


47 ఏళ్ల సాఫ్ట్ వెర్ ఇంజనీర్‌కు 2019 నుంచి దాదాపు ఐదు సంవత్సరాలుగా పునరావృతమయ్యే వెర్టిగో మరియు సమతుల్యత కోల్పోయే సమస్య ఉండేది. మొదట రోజుకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే వచ్చిన ఈ ఎపిసోడ్‌లు, ఒక నెలలోనే రోజుకు 8–10 సార్లకు పెరిగాయి. అల్లోపతి మందులు తీసుకున్నప్పటికీ పెద్దగా ఉపశమనం కలగకపోవడంతో, మగత మరియు బలహీనత వంటి దుష్ప్రభావాల కారణంగా ఒక నెల తరువాత వాటిని నిలిపివేశారు. తరువాత ప్రత్యామ్నాయ చికిత్స కోసం ఆయుర్వేదాన్ని ఆశ్రయించి, ఒక సంవత్సరం పాటు కొనసాగించినా పరిస్థితిలో మెరుగుదల కనిపించలేదు.

అదనంగా, గత మూడు సంవత్సరాలుగా మెడ, భుజాల్లో నిరంతర నొప్పి ఉండేది. ఆ నొప్పి చేతులు, వేళ్ల వరకు వ్యాపించేది. ఆయుర్వేద మందులు, అప్పుడప్పుడు తీసుకునే నొప్పి నివారిణులు తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇచ్చేవి. రెండు సంవత్సరాల క్రితం టిన్నిటస్ కూడా ప్రారంభమైంది. దీనికి అల్లోపతి చికిత్స ప్రయోజనం ఇవ్వకపోవడంతో పాటు, సరిగ్గా సహించలేకపోయారు. ఒక దశలో ఈ లక్షణాలు మానసిక కారణాలతో ఏర్పడినవి అని కూడా ఆయనకు చెప్పారు.

ఈ నిరంతర ఆరోగ్య సమస్యలు ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంపై తీవ్ర ప్రభావం చూపాయి. మొదట నెలకు ఒకసారి 3–7 రోజుల పాటు పనికి విరామం తీసుకోవాల్సి వచ్చేది; తరువాత నెలకు 2–3 సార్లు అలా చేయాల్సి వచ్చింది. చివరకు ఇంటి నుంచి పనిచేయడం కూడా కష్టమైంది, ఎందుకంటే ఎక్కువసేపు కంప్యూటర్ ఉపయోగించడం వల్ల లక్షణాలు మరింత తీవ్రమయ్యేవి.

ఇవన్నింటికీ తోడు, 20 డిసెంబర్ 2023న చేసిన లిపిడ్ ప్రొఫైల్ లో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు అధికంగా (కొలెస్ట్రాల్: 350 mg%, ట్రైగ్లిజరైడ్లు: 400 mg%) ఉన్నాయి. తీవ్రంగా ఆందోళన చెందిన ఆయన ఇతర స్వస్థతా విధానాలను అన్వేషిస్తూ వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్నారు.

ఆయనకు 10 జనవరి 2024:

CC3.5 Arteriosclerosis + CC3.7 Circulation + CC5.3 Meniere’s disease + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC18.7 Vertigo + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC20.6 Osteoporosis…TDS ఇవ్వబడింది.

అదనంగా పోషకాహారంతో కూడిన ఆహారం, యోగా, యోగా నిద్ర, క్రమం తప్పకుండా నడక, కంప్యూటర్‌పై ప్రతి గంట పని చేసిన తరువాత 10 నిమిషాల స్ట్రెచింగ్ విరామం, విశ్రాంతి కోసం సంగీతం వినడం వంటి సమగ్ర జీవనశైలి మార్పులను సూచించారు.

రెండు రోజుల్లోనే నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఐదవ రోజుకే వెర్టిగో ఎపిసోడ్‌లు పూర్తిగా ఆగిపోయాయి! మానసిక స్పష్టత, పని సామర్థ్యం తిరిగి రావడంతో ఆయన ఎంతో సంతోషించారు. 25 ఫిబ్రవరి 2024న చేసిన తదుపరి లిపిడ్ ప్రొఫైల్ లో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు సాధారణ స్థాయికి వచ్చాయి. మోతాదు ODకి తగ్గించారు.

ఏప్రిల్ 2025 నాటికి, ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. రెమెడీని మైంటెనెన్సు డొసేజ్గా OWలో కొనసాగిస్తూ, మెరుగైన జీవనశైలిని పాటిస్తున్నారు. ప్రస్తుతం తన స్వంత వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.