Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

మధుమేహం ప్రారంభ దశ ఉన్న వ్యక్తిలో తల తిరగడం మరియు అధిక ఆకలి 11602...India


48 ఏళ్ల పురుషుడికి నాలుగు నెలలుగా భోజనం చేసిన 2–3 గంటల తరువాత తలతిరగడం మరియు తీవ్రమైన ఆకలి కలిగేవి. ఇవి రోజుకు 4–5 సార్లు వచ్చి, ఒక్కోసారి 6–7 నిమిషాలు ఉండేవి; కొన్నిసార్లు చెమటలు కూడా పట్టేవి. ఏదైనా ఆహారం తీసుకున్న తరువాత లక్షణాలు తగ్గేవి. అందువల్ల త్వరగా ఉపశమనం పొందడానికి పండ్లు లేదా క్యాండీలు వెంట ఉంచుకునేవారు.

2017లో ఆయనకు హై బ్లడ్ ప్రెషర్ మరియు యాంజినా ఉన్న్ఉన్నఉన్నట్లు నిర్ధారణ అయింది. Telma 40 mg మరియు Amlodipine 5 mg రోజూ తీసుకుంటున్నారు. 9 జూన్ 2021న చేసిన రక్తపరీక్షలో ప్రీడయాబెటిస్, అధిక LDL కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్లు గుర్తించబడ్డాయి. Atorvastatin ఇచ్చినా, అల్లోపతి మందుల వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఒక వారం తరువాత నిలిపివేశారు. ECG, Echocardiogram, Treadmill పరీక్షల్లో అసాధారణతలు కనిపించలేదు.

11 జూన్ 2021:

#1. CC3.3 High Blood Pressure (BP) + CC3.5 Arteriosclerosis + CC4.10 Indigestion + CC6.3 Diabetes + CC15.1 Mental & Emotional tonic…TDS

#2. Potentised BP medications…OD, అల్లోపతి BP మందులు కొనసాగినంతకాలం తీసుకోవడానికి ఇచ్చారు.

అదనంగా జీవనశైలిలో మార్పులు సూచించారు. 3 రోజుల్లో లక్షణాలు రోజుకు 2–3 సార్లకు తగ్గాయి; ఒక్కోసారి 2–3 నిమిషాలు మాత్రమే ఉండేవి. 9వ రోజు వారానికి 1–2 సార్లకు తగ్గాయి. 30 జూన్: స్వస్థతను వేగవంతం చేయడానికి:

#3. CC17.2 Cleansing…6TD చేర్చారు.

7 జూలై: కేవలం ఏడు రోజుల్లో తలతిరగడం, చెమటలు సహా అన్ని లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. తరువాతి రక్తపరీక్షల్లో గ్లూకోజ్ మరియు కొవ్వు సాధారణ స్థాయికి వచ్చాయి. వైద్యుడు Amlodipine మోతాదును 5 mg నుంచి 2.5 mgకి సగానికి తగ్గించారు. #1 మరియు #3 మోతాదు ODకి తగ్గించారు. సెప్టెంబర్ 2021లో #3 నిలిపివేశారు.

ఏప్రిల్ 2025 నాటికి, అతను పూర్తిగా లక్షణరహితంగా ఉన్నారు. రక్తంలో గ్లూకోజ్, కొవ్వు స్థాయిలు సాధారణ రిమితుల్లో స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం #1 రెమెడీని maintenance dosageగా ODలో, అలాగే #2 రెమెడీని వైద్యుడు సూచించిన BP మందుతో పాటు కొనసాగిస్తున్నారు..