ఆమ్లత్వము మరియు మొలల వ్యాధి 11632...India
2010 నుండి గత 12 సంవత్సరాలుగా, 62 ఏళ్ల మహిళ ప్రతీ రోజు భోజనం తర్వాత కడుపు ఉబ్బరం, కడుపులో భారంగా అనిపించడం, త్రేన్పులు రావడం, గుండెల్లో మంట వంటి సమస్యలతో బాధపడుతోంది. అదనంగా, మలవిసర్జన సమయంలో నొప్పి లేకుండా రక్తస్రావం అయ్యేది. క్రమంగా ఈ సమస్య పెరిగి, మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు కూడా మలద్వారం నుంచి రక్తస్రావం అయ్యేది. దాంతో రోజంతా డైపర్లు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్దిగా కారంగా ఉన్న ఆహారం తిన్నా ఆమె సమస్యలు మరింత తీవ్రమయ్యేవి. అల్లోపతీ వైద్య చికిత్స వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయనే ఆందోళనతో ఆమె వైద్య సహాయం పొందడానికి ఇష్టపడలేదు. అందువల్ల, కఠినమైన ఆహార నియమాలను పాటిస్తూ, అసిడిటీ కోసం అల్లోపతీ ఔషధమైన పాంటాప్ 40 మి.గ్రా. తీసుకుంటూ తన సమస్యను నియంత్రించుకునేది. అంతేకాకుండా, గత 32 సంవత్సరాలుగా ఆమె నిద్రలేమితో కూడా బాధపడుతోంది.
మే 2021లో, ఆమె తల్లి ఒత్తిడి చేయడంతో ఒక వైద్యుడిని సంప్రదించింది. పరీక్షించిన వైద్యుడు ఆమెకు అంతర్గత మూలవ్యాధి ఉన్నట్లు నిర్ధారించి, శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారు. అయితే, క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లిని, గుండె శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న తన భర్తను చూసుకోవాల్సి ఉండటంతో ఆమె శస్త్రచికిత్సను వాయిదా వేసుకుంది.
2022 నవంబర్ 19న, ఆమె బోధిస్తున్న సాయి పాఠశాలలో ఉన్న వైబ్రియానిక్స్ వెల్‌నెస్ కేంద్రంలో చికిత్స పొందింది.
వత్తిడికి :
#1. CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic…TDS
ఆమ్లత్వము, అంతర్గత మూలవ్యాధికి :
#2. CC4.4 Constipation + CC4.10 Indigestion…TDS
నిద్ర లేమి సమస్యకు :
#3. CC15.6 Sleep disorders…నిద్రించడానికి అరగంట ముందు
ఆమె పాంటాప్ 40 మి.గ్రా. మందును తీసుకోవడం నిలిపివేసింది. మూడు రోజుల్లోనే, అంటే నవంబర్ 22న, అసిడిటీ లక్షణాలు 30% తగ్గాయని, ఆకలి కూడా మెరుగుపడిందని తెలిపింది. నవంబర్ 28 నాటికి, గత పది సంవత్సరాల్లో మొదటిసారిగా, ఎలాంటి ప్రతికూల సమస్యలు లేకుండా తనకు ఇష్టమైన ఆహారాన్ని సంతోషంగా తినగలిగింది! మరుసటి రోజు, మలవిసర్జన సమయంలో రక్తస్రావం రెండు రోజులకు ఒకసారి మాత్రమే జరుగుతోందని, మూత్రవిసర్జన సమయంలో, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు రక్తస్రావం జరగడం లేదని తెలిపింది. ఇంట్లో ఉన్నప్పుడు డైపర్లు ధరించడం కూడా మానేసింది.
డిసెంబర్ 1న, నిద్రకు సంబంధించిన సమస్య మినహా మిగతా లక్షణాలన్నీ పూర్తిగా తగ్గిపోయాయని ఆమె ఎంతో ఉత్సాహంగా తెలిపింది! అయితే, మరుసటి రోజు మలం గట్టిగా వస్తోందని, దీనివల్ల మళ్లీ రక్తస్రావం మొదలవుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చికిత్స వల్ల తాత్కాలికంగా లక్షణాలు పెరిగే పరిస్థితి పుల్లౌట్ కావచ్చని భావించి, డిసెంబర్ 9న #2 మందును తాత్కాలికంగా నిలిపివేశారు.
రెండు రోజుల్లోనే మలం గట్టిగా ఉండే సమస్య 25% తగ్గింది. డిసెంబర్ 19 నాటికి #2 మందు మోతాదును క్రమంగా పెంచి TDS తీసుకునే స్థాయికి చేర్చారు. 2023 జనవరి 10 నాటికి మలం గట్టిగా ఉండే సమస్య 50% మెరుగుపడింది. జనవరి 28 నాటికి ఈ సమస్య పూర్తిగా, అంటే 100% తగ్గిపోయింది.
ఆమెకు ఒత్తిడి అనిపించకపోవడంతో, జనవరి మొదటి వారంలోనే #1 మందును తీసుకోవడం మానేసింది. ఫిబ్రవరి 15న #2 మందు మోతాదును OD కి తగ్గించారు. ఆమె తన అభీష్టం మేరకు మరికొన్ని నెలల పాటు #3 మందుతో కలిపి ఈ మోతాదును కొనసాగించాలని నిర్ణయించుకుంది.
2024 జూన్ 18 నాటికి, ఆమె ఆరోగ్యంగా ఉంటూ, సాధారణ ఆహారాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకుంటోంది.
*హెచ్చరిక : ఈ మందును వైద్యుల ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే తీసుకోవాలి.