Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దద్దుర్లు 03608...South Africa


57 ఏళ్ల మాహిళకు హైపోథైరాయిడిజం (థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గడం) ఉన్నట్లు 2001లో నిర్ధారణ అయిన  ఏళ్ల మహిళ ప్రతిరోజూ అల్లోపతి మందు లెవోథైరాక్సిన్ తీసుకుంటున్నారు. 2020 మార్చి నుంచి ఆమె కాళ్లు, వీపు, చేతులు మరియు మెడపై తీవ్రమైన దురదతో కూడిన ఎర్రటి దద్దుర్లు రావడం ప్రారంభమైంది. ఇవి వారానికి మూడు సార్లు వచ్చేవి. దద్దుర్లు వచ్చిన వెంటనే వైద్యుడు సూచించిన అలర్జెక్స్ లేపనాన్ని రాసుకుంటే ఐదు నిమిషాల్లో ఉపశమనం కలిగేది.

ఈ దద్దుర్లు లెవోథైరాక్సిన్ మందు వల్ల వచ్చి ఉండవచ్చని ఆమె వైద్యుడు అనుమానించడంతో, ఆమె మానసిక ఒత్తిడికి గురయ్యారు. అయితే, వైబ్రియానిక్స్ అభ్యాసకురాలైన తన మేనకోడలు ద్వారా వైబ్రియానిక్స్ చికిత్స గురించి తెలుసుకున్నప్పుడు ఆమె ఎంతో సంతోషించారు.

8 డిసెంబర్ 2021న ఆమెకు ఈ క్రింది రెమెడీలు ఇచ్చారు::

#1. CC21.3 Skin allergies…BD కొబ్బరి నూనెలో బాహ్య అనువర్తనం కోసం

#2. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + #1…6TD మొదటి మూడు రోజులు వరకు అనంతరం TDS 

డిసెంబర్ 26న, గత వారంలో దద్దుర్లు రెండుసార్లు మాత్రమే వచ్చాయని, అయితే దురద లేదని రోగి తెలిపారు. నూనె రాసిన ఐదు నిమిషాల్లోనే దద్దుర్లు మాయమయ్యాయని, దాంతో అల్లోపతి లేపనం ఉపయోగించాల్సిన అవసరం లేకపోయిందని చెప్పారు. అంతేకాకుండా, తన మనసు గతంలో కంటే చాలా ప్రశాంతంగా ఉందని తెలిపారు. 10 ఫిబ్రవరి 2022న, గత వారంలో ఒక్కసారి మాత్రమే దద్దుర్లు వచ్చాయని ఆమె వెల్లడించారు. తాను ఇప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా ఉన్నానని తెలిపారు.

తదుపరి రెండు నెలల్లో, అంటే ఏప్రిల్ 13 నాటికి, కేవలం ఒక్కసారి మాత్రమే దద్దుర్లు వచ్చాయి. నూనె రాసుకున్న వెంటనే దద్దుర్లు మాయమవుతుండటంతో, ఆమె దానిని “మ్యాజిక్ ఆయిల్ రెమెడీ” (అద్భుతమైన నూనె మందు) అని పిలిచేవారు. #1 మరియు #2 రెమెడీల మోతాదును OD గా తీసుకునేలా తగ్గించారు. మే 19న, గత నెల రోజులుగా దద్దుర్లు పూర్తిగా లేవని ఆమె తెలియజేశారు. దాంతో #1 రెమెడీని నిలిపివేసి, #2 రెమెడీని 3TW కి తగ్గించారు.

జూలై నాటికి కూడా ఆమెకు ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. అనంతరం ఆమె విదేశాలకు వెళ్లిపోవడంతో రెమెడీలను నిలిపివేశారు. జూన్ 2024 నాటికి, ఆమె థైరాయిడ్ మందును యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఆమె చర్మం సాధారణ స్థితిలోనే ఉంది. అప్పుడప్పుడు స్వల్పంగా దద్దుర్లు వచ్చినప్పటికీ, అవి సుమారు ఒక నిమిషంలో వాటంతట అవే తగ్గిపోతున్నాయని తెలిపారు.