మూలవ్యాధి 10399...India
ప్రాక్టీషనర్ ఇంట్లో పనిచేసే 32 ఏళ్ల మహిళకు 2018 ఫిబ్రవరి నుంచి దాదాపు ఒక సంవత్సరం పాటు మలవిసర్జన సమయంలో గట్టి మలం రావడం సమస్యగా మారింది. ప్రతీసారీ మలవిసర్జన చేసినప్పుడు, మలద్వార ప్రాంతంలో తీవ్రమైన నొప్పి, మంటతో పాటు అధిక రక్తస్రావం కూడా అయ్యేది. జూన్ నెలలో వైద్యుడు ఆమెకు మూలవ్యాధి (పైల్స్) ఉన్నట్లు నిర్ధారించారు. వైద్యుడు సూచించిన మందులను ఆమె పది రోజుల పాటు తీసుకుంది. దాంతో రక్తస్రావం పూర్తిగా ఆగిపోయింది. అయితే, నొప్పి, మంట మాత్రం కొనసాగాయి. కొన్ని రోజుల తర్వాత మళ్లీ రక్తస్రావం ప్రారంభమైంది. అయితే, రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి మాత్రమే రక్తస్రావం అయ్యేది. రక్తస్రావం మరింత పెరుగుతుందేమోననే భయంతో ఆమె మరుగుదొడ్డికి వెళ్లడానికి కూడా భయపడేది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె మళ్లీ వైద్యుడిని సంప్రదించలేకపోయింది. వైబ్రియోనిక్స్ గురించి తెలుసుకున్నప్పుడు ఆమె ఎంతో ఆనందించింది. 2019 జనవరి 5న, ఆమెకు క్రింది రెమెడీ ఇవ్వబడింది :
CC3.2 Bleeding disorders + CC4.4 Constipation + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC21.11 Wounds & Abrasions…TDS
అయితే, ఈ సమస్య మళ్లీ తిరిగి వస్తుందేమోనని ఆమె కొంత ఆందోళన చెందింది. అందువల్ల, మొదట రోజుకు మూడుసార్లు (TDS) రెమెడీని కొనసాగించారు. అనంతరం మార్చి 6న మోతాదును OD కి తగ్గించారు. మార్చి 20న దానిని వారానికి ఒకసారి OW తగ్గించి, 2019 మే నెల చివరలో పూర్తిగా నిలిపివేశారు. వైబ్రియోనిక్స్ ద్వారా ఉపశమనం పొందినందుకు ఆమె ఎంతో కృతజ్ఞతను వ్యక్తం చేసింది. ప్రాక్టీషనర్ చివరిసారిగా 2020 ఆగస్టులో ఆమెను కలిసినప్పుడు, ఈ సమస్య మళ్లీ తిరిగి రాలేదని తెలిపింది.