ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్(ప్రకోప ప్రేగు రుగ్మత) (IBS) 11650...India
BMI(బాడి మాస్ ఇండెక్స్) 25 కలిగిన 13 ఏళ్ల బాలుడు ఒక రోజులో 3 లేదా 4 సార్లు (ఒక్కసారి వెళ్ళడం సాధారణ స్థాయి) మధ్యస్తంగా గట్టిమలంతో కొంచెం పొత్తికడుపు నొప్పితో మల విసర్జన చేయడం ప్రారంభించాడు. భోజనం చేసిన ప్రతీ సారి అసౌకర్యం మరియు వెంటనే మలవిసర్జన చేయవలసిన అవసరం రావడం దాంతో పరిమాణంతో సంబంధం లేకుండా పొత్తికడుపు తిమ్మిరి మరియు అసౌకర్యంతో డిసెంబర్ 15 నాటికి దీని ఫ్రీక్వెన్సీ 7 లేదా 8 రెట్లు పెరిగింది. అతని తరచూ వాష్ రూమ్ కి వెళ్ళడానికి తల్లి గమనించే వరకు బాలుడు ఈ విషయాన్ని చెప్పకుండా దాచాడు. గత కొన్ని రోజులుగా అతని ఆకలి తగ్గడం, వాష్ రూమ్ కి వెళ్ళవలసి వస్తుందనే భయంతో తినడానికి కూడా విముఖత చూపిస్తున్నాడు.
2022 డిసెంబర్ 10న అతనికి ఐబీఎస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అల్లోపతి మందులు తో ఉపశమనం పొందాడు అయితే మందులు ఆపిన తర్వాత లక్షణాలు పునరావృతం అయ్యేవి. అతను ఆహారం గురించి జాగ్రత్తగా ఉంటూ తేలికపాటి మసాలా ఉన్న ఆహారం మాత్రమే తీసుకుంటూ బయట ఆహారానికి దూరంగా ఉన్నాడు. 2023 మార్చిలో అతనికి మలాసనం దగ్గర నొప్పి కూడా అభివృద్ధి కావడంతో దానికి సమయోచిత లేపనంతో పాటు నోటి మందులు కూడా సూచింపబడ్డాయి. సాధారణంగా అతను లేపనాన్ని మాత్రమే ఉపయోగించేవాడు, లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు టాబ్లెట్లను ఆశ్రయించాడు కానీ అవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇచ్చాయి. 2024 లో తల్లిదండ్రులకు వైబ్రేషన్స్ గురించి తెలిసే వరకూ అతను నెలలు తరబడి ఈ విధంగా చేస్తూ వచ్చాడు. 2024 జనవరి 3న ప్రాక్టీషనర్ తో సంప్రదింపుల సమయంలో ఆ బాలుడు ఆరోజు ఉదయం నుండి పొత్తికడుపులో తిమ్మిరి, మరియు ఆసన నొప్పితో తరచుగా మోషన్ కి వెళ్లసాగాడు. తన కొడుకు సాధారణంగా రిజర్వుడు గా ఉంటాడని తల్లిదండ్రులతో తప్ప ఎవరితోనైనా పరిచయాలకు దూరంగా ఉంటాడని తల్లి చెప్పారు. ప్రత్యేకంగా వెబ్రియానిక్స్ రెమిడీలు ఎంచుకున్న తర్వాత అతను ఇతర మందులు నిలిపివేశాడు అతనికి క్రింది రెమిడీలు ఇవ్వబడ్డాయి:
జీర్ణ కోశ సంబంధిత సంస్యలకు :
#1. CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC10.1 Emergencies…6TD for five days followed by TDS
భావోద్వేగ శ్రేయస్సుకు :
#2. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic…TDS
సాధారణ ఆరోగ్య శ్రేయస్సుకు :
#3. IB*…OD
జనవరి 8 నాటికి ఐదు రోజుల్లో పొత్తికడుపు తిమ్మిరి అదృశ్యమైంది, మలము యొక్క ఫ్రీక్వెన్సీ రోజుకు 4 లేదా 5 సార్లకు తగ్గింది. జనవరి 16 నాటికి అతను రోజుకు రెండుసార్లు మాత్రమే సాధారణ మల విసర్జన చేస్తున్నాడు. ఆసన నొప్పి కూడా మాయమైంది. ఇంక అతని తల్లిదండ్రుల ఆనందానికి, బాలుడి సంతోషానికి అవధులే లేవు, ఇప్పుడు అతను మరింత ఆత్మ విశ్వాసంతో ఉంటూ ఇతరులతో కలిసిపోవడం ప్రారంభించాడు. జనవరి 22 నాటికి అతని ఆకలి తిరిగి ఏర్పడింది. అతని రోజుకు ఒకసారి మలవిసర్జన చేస్తున్నాడు. అతడికి అల్లోపతి మందుల అవసరం లేదని తల్లిదండ్రులు ధీమాగా ఉన్నారు. ఫిబ్రవరి 1 నాటికి 1# మరియు 2# కలిపి మోతాదును BD కి మరో రెండు వారాల్లో మరింత తగ్గి ప్రస్తుతం OD గాకొనసాగిస్తున్నాడు.
2024 ఏప్రిల్ 24 కి బాలుడు బాగానే ఉన్నాడు, అతని అధిక బరువుకు చికిత్స తీసుకుంటున్నాడు.
*IB combo ను వార్తాలేఖ సంపుటి 13 సంచిక 5 మేరకు ఇవ్వబడింది.