కోవిడ్ అనంతరం స్వరం కోల్పోవడం 03604...यूएसए
2022 జూన్ లో కోవిడ్ (ఒమిక్రాన్) వల్ల తీవ్రంగా ప్రభావితమైన 68 ఏళ్ల నటి మరియు గాయని బలమైన యాంటీబయాటిక్ మరియు స్టెరాయిడ్ చికిత్స పొంది కోలుకున్నారు. అయితే గొంతు నొప్పి మరియు దగ్గు నాలుగు నెలల పాటు కొనసాగి ఆమె మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు ఆమెకు గొంతు నొప్పి వచ్చేది. ఒకప్పుడు గంభీరంగా ఉన్న గొంతు ఇప్పుడు పేలవమైన కీసు గొంతుకలా మారిపోయింది. నవంబర్ 4న ENT స్పెషలిస్ట్ ఆమె గొంతులో వాపు మరియు పెరుగుదల రావడానికి తిత్తు లేదా పాలిప్ ఏర్పడడం కారణం అని గుర్తించి శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించారు. శస్త్ర చికిత్స వలన స్వరతంతువు దెబ్బతింటుందని ఇది తన కెరీర్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆమె ఆందోళన చెందారు. ఆమె స్వరపేటిక నిపుణుడు లారింగాలజిస్ట్ ను సంప్రదించగా డాక్టర్ నిర్ధారించిన దానిని ధ్రువీకరించి శస్త్ర చికిత్సను సిఫారసు చేసారు. శస్త్ర చికిత్స చేయించుకోవడానికి ఇష్టము లేకపోవడంతో 3వ అభిప్రాయం కోసం మరొక లారింగాలజిస్ట్ ను సంప్రదించగా మునుపటి ఫలితాలు ధ్రువీకరిస్తూ పాలిప్స్ వాటంతట అవే అదృశ్యం కావడం అసంభవం అని వ్యాఖ్యానించారు, కాబట్టి సంకోచముతోనే ఆమె శస్త్ర చికిత్సకు అంగీకరించారు.
శస్త్ర చికిత్స కోసం వేచి చూస్తున్న సమయంలో రోగి వైబ్రియానిక్స్ గురించి తెలుసుకొని ప్రాక్టీషనర్ను సంప్రదించారు. పాలిప్ మరియు ఇతర లక్షణాలతో పాటు ఆమె తన రోగ చరిత్రలో భాగంగా తన లోతైన బాధలు, కోపము వంటి విషయాలు వెళ్లడిస్తూ తనకు 29 సంవత్సరాల వయసులో తన జీవ సంబంధమైన కుటుంబము మొత్తాన్ని కోల్పోయి నట్లు తెలిపారు. అంతేకాక ఆరు సంవత్సరాల క్రితం ఆమె భర్త హఠాత్తుగా మరణించగా ఆమెపై తప్పుడు ఆరోపణలతో వాంగ్మూలం కొనసాగుతున్నది. ఆమె ఇప్పుడు ఒంటరిగా మరియు మానసికంగా కలత చెంది ఉన్నారు. 2023 మార్చి 26వ తేదీన ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic…TDS
మే 19న శస్త్ర చికిత్స కు ముందు చెకప్ సమయంలో డాక్టర్ ఆశ్చర్యపడే విధంగా గతంలో గుర్తించిన పాలిప్ కనుగొనబడలేదు. గొంతు నొప్పి మరియు దగ్గు కూడా అప్పటికే మాయమైపోగా ఆమె రెమిడి తీసుకోవడం మానేశారు. “ఇది దేవుని నుండి నేరుగా జరిగిన అద్భుతం” అని పేషంటు ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఆమెకు వాక్కు పూర్తిగా పునరుద్ధరింపబడింది కానీ వృత్తిపరమైన గాన ప్రమాణాలను తిరిగి పొందటానికి ఆమె స్పీచ్ థెరపీ చేయించుకున్నారు. ఆమె భావోద్వేగ శ్రేయస్సు కూడా మెరుగుపడి ఆమె సంతోషంగా తన పనిని తిరిగి కొనసాగించడానికి వీలు కల్పించింది.
సెప్టెంబర్ 18న తను ఇప్పుడు ఒక నూతన భావాన్ని స్వీకరించి సంపూర్ణంగా స్వస్థత పొందానని వైబ్రియానిక్స్ యొక్క రూపాంతర ప్రభావానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు వెళ్లడించారు. 2023 డిసెంబర్ 10 నాటికి ఆమె బోధించడం, నటించడం, పాడడం, యధావిధిగా కొనసాగిస్తున్నారు.