చర్మము పై దురద 11652...भारत
ప్రాక్టీషనర్ తన 57 ఏళ్ల కజిన్ ని సందర్శించినప్పుడు ఆమె తన కుడి ముంజేతి మణికట్టు, కుడి తొడ, మరియు కుడిఛీలమండ దగ్గర దురదగా ఉందని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం 2020 మే లో కోవిడ్ మహమ్మారి సమయంలో ఇంటిలో సహాయం చేసేవారు లేక పని భారం పెరిగడం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజూ 2-3 సార్లు ముఖ్యంగా ఇంటి పని తర్వాత స్వల్పంగానూ మరియు తోటపని తర్వాత ఎక్కువగాను దురద ఏర్పడుతోంది. తరచుగా గోకడం వల్ల ఆమె మణికట్టు మరియు చీలమండల వద్ద చిన్న చిన్న నల్లని మచ్చలు ఏర్పడ్డాయి. కాలక్రమేణా ఆమె తొడలు, నడుము, పొత్తికడుపు దిగువ భాగంపై దురద అభివృద్ధి చెందాయి. వేడినీటిలో ఉప్పు వేసుకొని స్నానం చేయడం మరియు కాండిడ్ క్రీమ్ ఉపయోగించడం వల్ల 2-3 గంటల వరకు ఉపశమనం లభిస్తున్నది. ఆమె వంటి సబ్బు మార్చడానికి ప్రయత్నించినప్పటికి దురద అలాగే కొనసాగింది. మేల్కొన్న తర్వాత 10 నుంచి 15 నిమిషాలు ఆమె చేతి వేళ్ళు మరియు కాలివేళ్ల వద్ద జలదరింపు అనుభూతిని కూడా అనుభవించసాగారు.
ఆమె వైద్యుడిని సంప్రదించడానికి ఇష్టపడలేదు. ఆమె ప్రభావిత ప్రాంతాలను గోకడం ప్రాక్టీషనర్ గమనించారు. 2023 మే 24న ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
#1. CC21.3 Skin allergies + CC21.6 Eczema…BD బాహ్య అనువర్తనం కోసం శుద్ధమైన కొబ్బరి నూనెలో
#2. CC18.5 Neuralgia + #1…TDS
ఆమె పరిస్థితి మెరుగుపడే వరకు చేతికి గాజులు ధరించకుండా ఉండాలని సూచించారు. సాధారణ స్నానాలు చేయడం ప్రారంభించి క్యాండీడ్ క్రీమ్ నిలిపివేశారు. జూన్ 7 నాటికి రెండు వారాల్లో దురద నుండి 50% ఉపశమనం లభించింది, కానీ మచ్చలు మారలేదు ఐతే దురద మణికట్టు మరియు చీల మండలకు పరిమిత మయ్యింది. ఫ్రీక్వెన్సీ వారానికి 2-3 సార్లు తగ్గింది, కొంత మెరుగైన అనుభూతి అనుభవించారు. జూన్ 26 న దురద పూర్తిగా పోయిందని మరియు మచ్చల రంగు కూడా మారిందని తెలియజేశారు. ఒక నెల తర్వాత జూలై 25న మచ్చలు పూర్తిగా అదృశ్య మయ్యాయని, తోటపని తర్వాత కూడా దురద రావడం లేదని తనకు 100% ఉపశమనం కలిగినట్టు తెలిపారు. అంతేకాక వ్రేళ్ళ జలధరింపు అనుభూతి కూడా అదృశ్యమైంది. #2 ను ఆగస్టు 22న ఆపివేసే వరకు BD కి తగ్గించబడింది. #1 రెమిడీ అయిపోయే వరకు కొనసాగించబడింది.
అక్టోబర్లో ప్రాక్టీషనర్ ఆమెను కలుసుకున్నప్పుడు దురద నుండి పూర్తిగా విముక్తి పొందినట్లు ఆమె సంతృప్తి మరియు ఆనందం వ్యక్తం చేశారు, డిసెంబర్ 2023 నాటికి ఆమె బాగానే ఉన్నారు.