రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ 11647...भारत
50 ఏళ్ల మహిళ 1997 నుంచి గత 30 సంవత్సరాలుగా వేళ్ళు మరియు మణికట్టు మొదట్లో నిరంతర నొప్పి మరియు వాపుతో బాధపడుతున్నారు. 2000 సంవత్సరంలో ఇది రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ గా (కీళ్ల వాతావ) నిర్ధారణ కావడంతో సూచించిన అల్లోపతి మందులు మౌఖికంగా మరియు బాహ్యంగా తీసుకుంటూ ఉన్నారు. ఆమె పరిస్థితి క్రమంగా క్షీణించి వేళ్ళు, మణికట్టు, తొడలు, మోకాలు, మరియు వీపు ముఖ్యంగా ఉదయం వేళల్లో విపరీతమైన భరించలేని నొప్పి మరియు దృఢత్వానికి దారితీసింది. మెడ మరియు భుజము నొప్పులు, ఉన్న బాధలకు తోడు కావడంతో ఆమెకు స్వేచ్ఛగా కదలికలు లేకపోవడంతో సాధారణ పనులు కూడా చేయలేకపోయేవారు. ఈమెకు సరియైన నిద్ర కూడా లేదు.
అల్లోపతి మందులు కొంత ఉపశమనం కలిగిస్తూ ఉన్నప్పటికీ అవి మగత, బలహీనత, అప్పుడప్పుడు వాంతులు వంటి దుష్ప్రభావాలకు కారణమయ్యాయి. మెరుగైన పరిష్కారాన్ని వెతుక్కుంటూ అనేక ప్రదేశాలకు ప్రయాణిస్తూ ఆయుర్వేదంతో సహా వివిధ ప్రత్యామ్నాయ చికిత్సలు ప్రయత్నించారు. తన జీవన నాణ్యత మెరుగుపరుచుకోవాలని తీవ్రంగా కోరుకుంటూ తన సోదరి సిఫారసు పై వైబ్రియానిక్స్ వైపు మొగ్గు చూపారు. 2023 జనవరి 8న ప్రాక్టీషనరు క్రింది రెమిడి ఇచ్చారు:
#1. CC10.1 Emergencies + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue…every 10 minutes ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున రెండు గంటల వరకు అనంతరం 6TD
#2. CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.7 Fractures…OD నువ్వుల నూనెలో బాహ్య అనువర్తనం కోసం.
ఆమె అల్లోపతి మందులు కూడా కొనసాగించారు. ఫిబ్రవరి 15 నాటికి నొప్పి, వాపు మరియు ధృఢత్వం లో 25% ఉపశమనం కలిగిందని చాలా కాలం తర్వాత తన సుఖంగా ఉన్నానని ఆమె ఆనందంతో తెలియజేశారు. జూన్ 2 నాటికి ఆమె లక్షణాలలో 60% మెరుగుదల ఏర్పడడంతో పాటు నిద్ర కూడా మెరుగుపడింది. ప్రాక్టీషనర్ సలహా అనుసరించి వ్యాయామం, యోగా, సమతుల్య ఆహారము స్వీకరిస్తూ ఆమె ఆరోగ్యకరమైన జీవన శైలి అనుసరించ సాగారు. ఆగస్టు 10 నాటికి 80% ఉపశమనం పొందడంతో అల్లోపతి మందులను నిలిపివేయడానికి తగినంత నమ్మకం ఏర్పడింది. #1 యొక్క మోతాదు TDS కు తగ్గించబడింది.
సెప్టెంబర్ 9న అన్ని రోగ లక్షణాల నుండి 100% ఉపశమనం లభించినందుకు ఆమె ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ప్రతికూల ప్రభావాలతో కూడిన ఖరీదైన మందుల అవసరం లేకుండా తన రోజువారి పనులను తిరిగి ప్రారంభించగలిగారు. #1 యొక్కమోతాదు OD కి తగ్గించ బడింది. అద్భుతముగా కోలుకున్నందుకు కృతజ్ఞతలు మరియు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు తన ఇంటి నుండి బయటకు వెళ్లగలుగుతున్నారు, ప్రయాణంలో అవసరం మేరకు నొప్పి నివారిణి పై ఆధార పడుతున్నారు. ఆమె OD వద్ద రెమెడీ కొనసాగించడానికి ఇష్టపడుతున్నారు.
2023 డిసెంబర్ 25 నాటికి ఎటువంటి పునరావృతం లేదు.