శ్వేశ కోశ ఎలర్జీ, నిద్రా రుగ్మత 11655...भारत
45 ఏళ్ల మహిళ గత 15 సంవత్సరాలుగా తుమ్ములు, ముక్కు కారడం, నిద్రా రుగ్మత తో బాధపడుతున్నారు. దుమ్ము మరియు పుప్పొడి వలన ప్రతి రెండు రోజులకు ఒకసారి ఈ లక్షణాలు ఏర్పడి ఏడాది పొడవునా కొనసాగి శీతాకాలంలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. తుమ్ముల దాడి కొన్నిసార్లు ప్రతీ 10-15 నిమిషాలకు పునరావృతం అయ్యి కొన్ని గంటల పాటు తుమ్ములు కొనసాగుతాయి. 1లేదా 2 గంటల లోపు తుమ్ములు ఆగిపోక పోతే సూచించబడిన యాంటీ హిస్టమిన్ OD గా తీసుకొనగానే తుమ్ములు 30 నిమిషాల్లో తగ్గిపోతాయి. యాంటీ హిస్టమిన్ యొక్క ఉపశమన ప్రభావ కారణంగా ఆమె దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుటకు ప్రాముఖ్యత ఇవ్వసాగారు. 2023 మే లో ఒక నెలపాటు మందులు తీసుకోకుండా కాలం వెళ్ళదీద్దామనే ప్రయత్నంలో ఆమె తీవ్రమైన పొడి దగ్గుతో పాటు తన లక్షణాలు మరింత తీవ్రమవుతున్నట్లు గుర్తించారు. అల్లం మరియు తేనె వంటి ఇంటి నివారణలను ఆశ్రయించడం కొంత ఉపశమనం కలిగింది. అయినప్పటికీ యాంటీ హిస్టమిన్ యొక్క ఆవశ్యకత గ్రహించి ఆమె దాన్ని తీసుకోవడం కొనసాగించారు. ప్రాక్టీషనర్ను సంప్రదించే నాటికి ఆమె ఒక నెలరోజులుగా తీవ్రమైన పొడి దగ్గు మరియు తుమ్ములతో బాధ పడుతున్నారు.
ఆమెకు నిద్రపోవడం కూడా కష్టము కావడంతో పుస్తకాలు చదువుతూ నిద్రకు ఉపక్రమించడానికి ప్రయత్నించేవారు. అది విఫలమైనప్పుడల్లా సూచించిన స్లీపింగ్ పిల్ మాత్రమే వేసుకొని ఒక గంటలోపు నిద్రపోసాగారు. 2023 ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
శ్వాశ కోశ ఎలర్జీ కి :
#1. CC19.2 Respiratory allergies + CC19.5 Sinusitis + CC19.6 Cough chronic…ప్రతీ 10 నిమిషాలకి ఒక మోతాదు చొప్పున 2 గంటల వరకు అనంతరం 6TD
నిద్ర పోవడంలో ఇబ్బందికి :
#2. CC15.6 Sleep disorders…నిద్రించ డానికి గంట ముందు ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు.
మరుసటి రోజు స్లీపింగ్ టాబ్లెట్స్ అవసరం లేకుండానే #2 యొక్క రెండు మోతాదుల తర్వాత చక్కగా నిద్రపోతున్నట్లు తెలిపారు. దగ్గు కూడా 25% తగ్గింది. ఆమె అవసరం మేరకే యాంటీ హిస్టమిన్ తీసుకోవడం కొనసాగించారు.
జూన్ 17న దగ్గు తగ్గడంతో #1 యొక్క మోతాదు TDS కు తగ్గించబడింది. వైబ్రియానిక్స్ పట్ల విశ్వాసం బలపడడంతో యాంటీ హిస్టమిన్ పుర్ర్తిగా ఆపివేశారు. ఈ సందర్భంగా తుమ్ములు, ముక్కు కారడం రెమిడీ తీసుకోవడం నిలిపి వేస్తేనే వస్తున్నట్లు ఆమె గుర్తించారు. అటువంటి పరిస్థితి లో #1 తరుచుగా వేసుకోమని సూచించడం జరిగింది. జులై మొదటి వారంలో ఆమె నిద్ర పూర్తిగా పునరుద్ధరింపబడటంతో #2 ఆపి వేయడం జరిగింది. తదుపరి ఒక నెల రోగ లక్షణ రహితంగా ఉన్నారు కాబట్టి #1 యొక్క మోతాదు ODకి ఆగస్టు చివరి నాటికి OW కి తగ్గించబడింది.
నవంబర్ 23 నాటికి ఎటువంటి పునరావృతం లేదు ఆమె OW నిర్వహణ మోతాదు కొనసాగిస్తున్నారు.