ఋతు క్రమ రుగ్మత 03614...यूएसए
44 ఏళ్ల మహిళకు ఎల్లప్పుడు 23- 25 రోజుల ఋతు చక్రం సాధారణ రక్తస్రావంతో నాలుగు రోజులు పాటు కొనసాగుతూ ఉండేది. నవంబర్ 22 నుండి ప్రతీ పీరియడ్ యొక్క వ్యవధి మరియు రక్త స్రావము తగ్గటం మొదలైంది. దీంతో పాటుగా పొత్తికడుపు నొప్పి, ఉబ్బరం, మరియు బలహీనత ఆ పీరియడ్ మొత్తము కొనసాగడం ప్రారంభించింది. 2023 జనవరి నాటికి ఆమె ఋతుస్రావం చాలా తక్కువ ప్రవాహంతో మూడు రోజులు మాత్రమే కొనసాగింది. మార్చి నాటికి అది రెండు రోజులకు తగ్గింది. మే నెలలో ఆమె ఋతుస్రావం 10 రోజులు ఆలస్యం అయ్యింది. ఈ మార్పులను ఋతు విరతి (మెనోపాస్) ప్రారంభ అవస్థగా భావించి ఆమె తన తల్లిలో గమనించిన లక్షణములకు ఆపాదిస్తూ ఆమె ఎటువంటి చికిత్సా తీసుకోలేదు. దశాబ్దాలుగా అధిక బరువు 75 కేజీలు ఉన్నప్పటికీ ఆమె చురుకుగా ఉంటారు, మంచి శాఖాహారం తింటారు, ప్రతిరోజు వ్యాయామం చేస్తారు, ఆరోగ్యకరమైన జీవనశైలి నిర్వహిస్తున్నారు. తన అంకుల్ నుండి వైబ్రియానిక్స్ గురించి విన్న వెంటనే 2023 జూన్ 5న ప్రాక్టీషనర్ ను సంప్రదించగా క్రింది రెమిడి ఇవ్వబడింది:
ఋతు రుగ్మత కోసం :
#1. CC8.8 Menses irregular…TDS
సాధారణ ఆరోగ్య శ్రేయస్సు కోసం :
#2. IB…OD
జూన్ 30 నాటికి 23 రోజుల తర్వాత ఆమె ఋతుక్రమం షెడ్యూల్ ప్రకారం తిరిగి ప్రారంభమై, ఆ సమయంలో నొప్పి, ఉబ్బరం, లేదా బలహీనత లేకుండా సాధారణ ప్రవాహం కొనసాగిందని తెలిపారు. జూలై 30న కూడా ఇదే కధ కొనసాగిందని రోగి తెలిపారు. కాబట్టి #1 యొక్క మోతాదు రెండు వారాలకు BD కి, మరొక వారానికి OD కి ఆ తర్వాత నిర్వహణ మోతాదు OW కి తగ్గించబడింది.
తర్వాత నాలుగు నెలలు ఋతుక్రమం నవంబర్ 22 కి ముందు మాదిరిగానే ఉంది. 2023 నవంబర్ నాటికి రోగి రెమిడీలను సంతోషంగా కొనసాగిస్తున్నారు.
రోగి యొక్క వాంగ్మూలము వెబ్సైట్ లో అందుబాటులో ఉంది.