పార్శ్వపు నొప్పి 11633...भारत
49 ఏళ్ల మహిళ 12 సంవత్సరాలుగా వారానికి 2-3 సార్లు మైగ్రేన్ తలనొప్పితో బాధ పడుతున్నారు. ఇట్టి ఇబ్బంది ఏర్పడిన ప్రతీ సారి తనకు తల ఎడమవైపున తీవ్రమైన నొప్పి, వికారము, అలసట, చికాకు, మరియు అధిక చమటతో ఇబ్బంది పడుతున్నారు. ఈ లక్షణాలు సాధారణంగా రెండు గంటల్లోవాటంతట అవే తగ్గిపోతాయి. అయితే అనంతర పరిణామాలు ఆమె రోజంతా అలసిపోయినట్లు చేసి తన నిత్య కృత్యాలకు భంగం వాటిల్లే లాగా చేస్తున్నాయి. రాత్రిపూట తలనొప్పి వస్తే నిద్రకు భంగం కలుగుతోంది. బిగ్గరగా ఉండే ధ్వనులు, ఎండకు గురి కావడం, లేదా మొబైల్ స్క్రీన్ ని 10 నిమిషాలు చూడడం ఆమె లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తున్నవి.
అలోపతి చికిత్సకు ఇష్టపడక తలనొప్పి భరించ లేనప్పుడు ఓవర్ ది కౌంటర్ (OTC) పెయిన్ కిల్లర్ తీసుకునేవారు. ఇది ఆమెకు ఒక గంట సేపు ఉపశమనం ఇచ్చేది. నొప్పి భరించ లేనంతగా లేని సందర్భాల్లో లక్షణాలు తగ్గే వరకు విశ్రాంతి ఎంచుకునేవారు. మధుమేహం చికిత్స విషయంలో తన భర్త పొందిన విజయవంతమైన అనుభూతి యొక్క స్ఫూర్తితో 2022 జనవరి 24న ప్రాక్టీషనర్ ను సంప్రదించగా ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC11.4 Migraines + CC12.1 Adult tonic + CC18.5 Neuralgia...TDS
#2. CC15.6 Sleep disorders...OD
2022 మే వరకు అనగా తర్వాత నాలుగు నెలల వరకు ఆమె భర్త తన సొంత రెమిడీని రీఫిల్ చేసుకోవడానికి వచ్చేవరకు రోగి నుండి ఎలాంటి ఫీడ్బ్యాక్ లేదు. తన భార్యను బలహీన పరిచిన మైగ్రేన్ తలనొప్పి పూర్తిగా విలిచిపోయిందని అతను ప్రాక్టీషనర్ కు తెలియజేశారు. మరిన్ని వివరాల కోసం రోగిని సంప్రదించినప్పుడు రెమిడి ప్రారంభించిన మొదటి రెండు వారాల్లో ఆమెకు కేవలం రెండు సార్లు మాత్రమే ఇబ్బంది ఏర్పడిందని ఆమె వెల్లడించారు. అంతేకాక ఇప్పుడు తలనొప్పి సాధారణ తీవ్ర లక్షణాలు లేకుండా స్వల్పంగా ఉంటోంది. తర్వాత రెండు వారాల్లో ఆమె పరిస్థితి మరింత మెరుగుపడి కేవలం ఒక్కసారి మాత్రమే ఇబ్బంది ఏర్పడింది. ఏప్రిల్ లో తలనొప్పి పూర్తిగా మాయమయ్యే నాటికి ఈ రెండు నెలల్లో తలనొప్పి తీవ్రత మరియు తరుచుదనం క్రమంగా తగ్గింది. రెమిడీ ప్రారంభించిన నాటినుండి ఆమెకు OTC మెడిసిన్ అవసరం రాలేదని తనకు నిద్రలో కూడా ఎటువంటి సమస్య ఏర్పడలేదని సంతోషంగా తెలియజేసారు. గతంలో మాదిరిగా కాకుండా ఆమె ఎండ వేడిమి తీవ్రంగా ఉండే ప్రదేశానికి యాత్రకు వెళ్ళినప్పటికీ ఎటువంటి తలనొప్పి లేకుండా ఆనందంగా ఉన్నట్లు తెలియ జేసారు. గోళీలు పూర్తి కాగానే 2022 మే నెలలో వాటిని ఆపివేసారు.
2023 నవంబర్ నాటికి ఎటువంటి పునరావృతం లేకుండా ఆనందంగా ఉన్నారు.