శ్వాస అందక పోవడం, పిల్లి కూతలు 11633...भारत
55 ఏళ్ల వ్యక్తి గత 24 సంవత్సరాలుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు పిల్లికూతలతో బాధపడుతున్నారు. ప్రారంభంలో ఈ లక్షణాలు చలికాలంలో మరియు దుమ్ముకు గురి కావడం వలన ఏర్పడి 1998లో అలర్జీ బ్రౌన్కైటీస్ నిర్ధారణకు దారి తీసింది. చికిత్స ఆస్థాలిన్ మాత్రలతో ప్రారంభమై తర్వాత బ్రాంఖో డై లేటర్ మరియు స్టెరాయిడ్ (నోటికి మరియు ఇంజక్షన్ ద్వారా) ఇచ్చారు కానీ పరిమిత ఉపశమనం లభించింది. 2002-2003లో అతను లైవ్ ఫిష్ ట్రీట్మెంట్ వంటి సంప్రదాయ పద్ధతులు ప్రయత్నించారు కానీ అది కూడా ఫలించలేదు. 2007 నాటికి ఊపిరి ఆడక పోవడం పిల్లి కూతలు అనేవి రోజువారి సంఘటనగా మారి మెట్లు ఎక్కడం, తలస్నానం చేయడం, దోసకాయ, ఐస్ క్రీమ్ వంటి కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా సమస్య మరింత తీవ్రమయ్యేది. పడుకోవడం కూడా అసౌకర్యాన్ని కలిగించి రాత్రంతా కూర్చున్న స్థితిలో నిద్రపోయేలా చేస్తోంది. అతనికి ఆస్థాలిన్ ఇన్హేలర్ సూచించగా అది పది నిమిషాల్లో ఉపశమనము కలిగించి రోజంతా రోగ లక్షణరహితంగా ఉండ సాగారు. అతను ఒక్క మోతాదు దాటవేసినా అతనికి ఊపిరి అందని పరిస్థితి ఏర్పడుతోంది.
అల్లోపతి ఔషధాలపై ఆధారపడకుండా ఉండేందుకు 2016- 2021 వరకు హోమియోపతి ప్రయత్నించారు కానీ ఉపశమనం తాత్కాలికంగా ఉండేది, అంతే కాక ఇబ్బంది నుండి అధిగమించ డానికి వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇన్హేలర్ అవసరము ఏర్పడేది. శాశ్వతమైన మరియు ఆశాజనకమైన పరిష్కారం కోసం అతను వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్న వెంటనే 2022 జనవరి 5న ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. అతనికి అనేక సంవత్సరాలుగా గురక కూడా ఉంది. ఇన్హేలర్ తప్ప మరే ఇతర మందులు అతను తీసుకోవడం లేదు. అతనికి క్రింది రెమిడి ఇవ్వబడింది:
శ్వాస అందక పోవడం , పిల్లి కూతలు:
#1. CC3.1 Heart tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.4 Asthma attack...TDS
సాధారణ ఆరోగ్య శ్రేయస్సుకు:
#2. IB...OD
గురకకు:
#3. CC15.6 Sleep disorders...OD
జనవరి 29 నాటికి శ్వాస లోపం మరియు పిల్లి కూతలు నుంచి 30% ఉపశమనం లభించింది, ఇన్హేలర్ వాడకం కూడా వారానికి ఒక సారికి తగ్గింది. ఏప్రిల్ చివరి నాటికి తనకు 80% వరకూ తగ్గిందని ప్రతీ రోజు కాకుండా దుమ్ము వలన లేదా మెట్లు ఎక్కినప్పుడు, తల స్నానం చేసినప్పుడు, మాత్రమే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతోందని తెలిపారు. గతంలో లాగా కూర్చుని కాకుండా సాధారణ స్థితిలోనే తను నిద్రపోగలుగుతున్నానని అంతేకాక గత మూడు నెలల్లో ఒక్కసారి మాత్రమే ఇన్హేలర్ ఉపయోగించానని తెలిపారు. ప్రాక్టీషనర్ మార్గదర్శకత్వాన్ని అనుసరించి జాగ్రత్తగా తన ఆహారంలో పెరుగు, దోసకాయ ఐస్ క్రీములు తక్కువ స్థాయిలో ప్రవేశపెట్టారు. ఈ ఆహారాలు అతని వ్యాధి లక్షణాలను ప్రేరేపించడం లేదా తీవ్రతరం చేయక పోవడం గమనించి అతను ఆశ్చర్య ఆనందములను పొందారు. సెప్టెంబర్ చివరి నాటికి మరో 5 నెలలు గడిచే సరికి అతని లక్షణాలు అన్నీ మాయమయ్యాయి, మెట్లు ఎక్కడం, దుమ్ము, ధూళికి గురికావడం వల్ల అతి తక్కువ అసౌకర్యం కలుగుతోంది. #1 మోతాదు BD తగ్గించబడింది.
2023 జనవరి లో విదేశాలకు వెళ్ళినా ఎటువంటి లక్షణాలు పునరావృతం కాలేదు. అంతకు ముందు ప్రయాణాలతో పోలిస్తే ఇది స్వాగతింపతగిన మార్పు. ఐతే శీతాకాలం లో తల స్నానం చేసినప్పుడు స్వల్పంగా శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది గమనించారు, ఐతే తన బిజీ వర్క్ షెడ్యూల్ కారణంగా ఇన్హేలర్ ద్వారా తక్షణ ఉపశమనం పొందేందుకు సౌకర్యవంతంగా ఉన్నారు.
నవంబర్ నాటికి ఎటువంటి పునరావృతం లేదు అతను #1 మరియు #2 మెయింటెనెన్స్ డోస్ OD గా కొనసాగించడానికి ఇష్టపడుతున్నారు. దురదృష్టవశాత్తు #3 సీరియస్ గా తీసుకోక పోవడంతో గురకలో మెరుగుదల లేదు.