Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

తెల్ల కుసుమ వ్యాధి 11633...भारत


వృత్తి రీత్యా దర్జీ పని చేసే (సీమ్ స్ట్రెస్*) 36 ఏళ్ల స్త్రీ 2022 సెప్టెంబర్ నుండి 4 నెలలుగా ప్రతీరోజూ దుర్వాసనతో కూడిన తెల్లటి యోని ఉత్సర్గాన్ని కలిగి ఉన్నారు. ఆమెకు యోని వద్ద దురద కూడా ఏర్పడి తన పనికి అంతరాయం మరియు అసౌకర్యానికి గురి చేసింది. నవంబర్లో డాక్టర్ గర్భాశయంలో పుండు ఉన్నట్లు అనుమానిస్తూ పెల్విక్ స్కాన్ సిఫారసు చేశారు. స్కాన్ కు భయపడి సూచించిన మందులను మాత్రమే ఎంచుకున్నారు. కానీ తిమ్మిరి మరియు అస్పష్ట మైన దృష్టి వంటి దుష్ప్రభావాల కారణంగా రెండు రోజుల్లో వాటిని నిలిపివేశారు. పక్కింటి వారు వైబ్రియానిక్స్ గురించి తెలియ చేయగా ఆమె ప్రాక్టీషనర్ ను సంప్రదించి తన సమస్య వెల్లడించి పని వత్తిడి కారణంగా తగినంత నీరు తీసుకోవడం లేదని వెల్లడించారు. 2023 జనవరి 22న ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:  

CC8.5 Vagina & Cervix + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.7 Fungus...TDS 

నీటి వినియోగాన్ని క్రమంగా పెంచాలని ఆమెకు సూచించారు. ఫిబ్రవరి చివరి నాటికి అన్ని లక్షణాల్లో 30% మెరుగుదల ఉంది, మార్చి చివరి నాటికి ఇది 80% నకు చేరింది. ఏప్రిల్ 10 నాటికి రోగ లక్షణ రహితంగా మారి అసౌకర్యం లేకుండా తన టైలరింగ్ పనిని కొనసాగిస్తున్నారు. మొతాదు పది రోజుల పాటు OD కి తగ్గించబడింది మరియు మే 25న ఆపివేసే వరకు క్రమంగా తగ్గించబడింది. 2023 నాటికి నవంబర్ నాటికి ఎటువంటి పునరావృతం లేదు.

 *జీవనం కోసం బట్టలు, వస్త్రములు కుట్టే స్త్రీ