Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

శిశువులో విస్తరించిన అడినాయిడ్లు 03511...यूके


2023 జనవరి 16 న శిశువులో 15 నెలల శిశువు 7 నెలలుగా నిరంతరాయంగా ముక్కు కారడంతో బాధపడుతున్నది. రాత్రిసమయంలో ముక్కు మూసుకుపోతు అది ఆమె నిద్రకు భంగం కలిగిస్తున్నది. రెండు నెలల తర్వాత ఆమెకు విస్తరించిన ఆడినాయిడ్స్ (ముక్కు మరియు గొంతు వెనక శ్వాసరస కణజాలం) ఉన్నట్లు నిర్ధారణ చేసి  కాల్ పోల్ మరియు మల్టీ విటమిన్ సిరప్ సూచించబడింది. ఇవి ఆమెకు తాత్కాలిక ప్రయోజనం మాత్రమే చేకూర్చి కడుపునొప్పి, గట్టి మలం, మరియు వాంతులు వంటి దుష్ప్రభావాలకు కారణమయ్యాయి. మందు వల్ల మేలు కంటే కీడే ఎక్కువ అనిపించి మూడు నెలల తర్వాత ఆపేశారు. పాప విరామం లేకుండా బాధ అనుభవిస్తూ ఏడుస్తూ నర్సరీకి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. కాలేజీలో సహచరిగా ఉన్న వ్యక్తి ద్వారా పాప తల్లి వైబ్రియానిక్స్ గురించి తెలుసుకొని దాన్ని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు.                                                                                                                     

2023 జనవరి 16 పాప కు క్రింది రెమిడీ ఇవ్వ బడింది: 

CC19.5 Sinusitis…6TD రెండు రోజుల వరకు తదనంతరం TDS

ఒక వారంలో శిశువు ముక్కు కారడం నుండి 75% ఉపశమనం పొందింది, మరియు ఆమె నిద్ర మెరుగుపరచబడింది. మరొక వారం తర్వాత లక్షణాలు అన్నీ అదృశ్యం అయ్యాయి; ఆ తర్వాత ఆమె గాఢ నిద్ర అనుభవిస్తూ తన ఉల్లాసపరితమైన స్వభావానికి తిరిగి వచ్చింది. రెమిడి ఆపడానికి ముందు మరో మూడు వారాలపాటు కొనసాగించబడింది.                                              

2025 సెప్టెంబర్ 23 నాటికి శిశువు లక్షణాల్లో ఎటువంటి పునరావృతం లేకుండా ఆరోగ్యంగా ఉంది