కోవిడ్ అనంతర ప్రభావములు, నడుము నొప్పి 11648...भारत
33 ఏళ్ల మహిళకు ఏప్రిల్ 2021లో కోవిడ్ (డెల్టా) వచ్చింది మరియు రెండు నెలల తర్వాత కోలుకున్నారు. అయినప్పటికీ, ఆమెకు ప్రతిరోజూ ఉదయం ఆమె అన్ని కీళ్లలో నొప్పి మరియు దృఢత్వం మొదలై రెండు గంటల పాటు శరీరాన్ని కదిలించిన తర్వాత మాత్రమే ఇది తగ్గుతుంది. ఆమె చాలా బలహీనంగా భావించింది మరియు రోజంతా శక్తి హీనంగా ఉంటోంది. 2022 జూన్ లో ఆమెకు మళ్లీ కోవిడ్ (ఒమిక్రాన్) సోకింది మరియు 15 రోజుల పాటు స్టెరాయిడ్‌లతో చికిత్స పొందిన తర్వాత కోలుకున్నారు. అయితే ఇప్పుడు ఆచరణాత్మకంగా అన్ని సమయాల్లో ఆమె మరింత బలహీనం ఐనట్లు భావించారు.
అక్టోబరులో, ఇల్లు మారవలసి వచ్చినప్పుడు బరువైన గృహోపకరణాలను ఎత్తినప్పుడు ఆమెకు నడుము నొప్పి ఏర్పడింది, ఇది రాత్రిపూట పూర్తి విశ్రాంతి తీసుకున్న తర్వాత మాత్రమే కొంత మెరుగుదల చూపుతోంది. ఆమె రెండు గంటలకు పైగా కూర్చుంటే, భరించలేని నొప్పి కలిగేది. వైద్యుడు దానిని డిస్క్ ప్రోలాప్స్‌గా నిర్ధారించి కండరాల సడలింపు మరియు నొప్పి నివారణ కోసం మందులు సూచించి చాలా నెమ్మదిగా మరియు జాగ్రత్తగా కదలమని ఆమెకు సలహా ఇచ్చారు. ఇవి ఆమెకు కొంత ఊరటనిచ్చాయి. అలాగే గత 3½ సంవత్సరాలుగా, ఆమెకు అప్పుడప్పుడు తేలికపాటి మైగ్రేన్ వచ్చేది, అయితే కోవిడ్ తర్వాత, అది తీవ్రంగా మారింది, ప్రతి వారం పునరావృతమవుతుండడంతో ఆమె నొప్పి నివారణ మందులను ఆశ్రయించాల్సి వచ్చింది. 2 జనవరి 2023 జనవరి 2న, ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
కోవిడ్ అనంతరం సమస్యల నిమిత్తము :
#1. IB Recuperation*…OD
వెన్ను నొప్పి కోసం :
#2. CC20.5 Spine + CC20.7 Fractures…BD బాహ్య అనువర్తనం కోసం ఆవాల నూనెలో
ప్రతిరోజూ 10-15 నిమిషాల పాటు నడవాలని, సున్నితమైన స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలని ఆమెకు సలహా ఈవ్వబడింది. చక్కని అనుభూతి కలగడం ప్రారంభమై జనవరి 17 నాటికి, ఆమె బద్ధకం 50% తగ్గింది కానీ ఆమె కీళ్ల నొప్పులు మరియు దృఢత్వం మాయమైంది. ఫిబ్రవరి 1 నాటికి, నీరసం మరియు బలహీనత 70% తగ్గింది, అయితే వెన్నునొప్పి 30% మాత్రమే తగ్గింది. ఆమె మార్చిలో కండరాల సడలింపు కోసం మందు మరియు పెయిన్ కిల్లర్ తీసుకోవడం మానివేశారు. మే ప్రారంభంలో, నడుము నొప్పితో సహా ఆమె కోవిడ్ అనంతర లక్షణాలన్నీ మాయమయ్యాయి, కాబట్టి ఆమె మే రెండవ వారంలో #1 మరియు #2 నిలిపివేశారు.
ఆగస్ట్ 3 నాటికి, ఎటువంటి పునరావృతం లేదు. ఈ మెరుగుదల ద్వారా ప్రోత్సహించబడిన ఆమె ఇప్పుడు పిసిఒడి మరియు కోవిడ్-పూర్వ స్థాయిలో ఆమెకు అప్పుడప్పుడు వచ్చే తేలికపాటి మైగ్రేన్ కోసం చికిత్సను కోరారు.
*కోవిడ్-19 నివారణకు సంబంధించిన అప్‌డేట్ కోసం వాల్యూం 13లోని సెప్టెంబర్/అక్టోబర్ 2022 సంచిక #5ని చూడండి.