సక్రమంగారాని పీరియడ్లు 11386...India
24 సంవత్సరాల మహిళ తనకు ఋతుస్రావం సకాలంలో రాని సమస్య నిమిత్తం అభ్యాసకుని వద్దకు చికిత్స కోసం వచ్చారు. కొన్నిసార్లు ఋతుస్రావం మూడు నెలల వరకూ కూడా రాదు. ఆమెకు అండాశయంలో కణుతులు ఉన్నాయని డాక్టర్ గుర్తించి స్టెరాయిడ్స్ ఇచ్చారు. దీని ఫలితంగా ఆమె బరువు పెరగడం మరియు ముఖం మీద వెంట్రుకలు రావడం ప్రారంభించాయి. ముఖం మీద జుట్టు మరియు బరువు పెరగటం ఆమెకు చాలా ఇబ్బంది కలిగించాయి. ఆమెకు వైబ్రియానిక్స్ వైద్యం ఏమైనా సహాయం చేస్తుందని భావించి చికిత్సకోసం అభ్యాస కుని వద్దకు వచ్చారు. ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC8.1 Female tonic…TDS
మూడు నెలలలో ఆమెకు ఋతు చక్రం సక్రమంగా రావడం ప్రారంభించింది. ఆమె ముఖం మీద ఉన్న అనవసరమైన వెంట్రుకలు మరియు అధికబరువు కూడా పూర్తిగా తగ్గిపోయింది.