Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అరుదుగా వచ్చే ఋతుక్రమం (PCOD) 03582...South Africa


45 సంవత్సరాల మహిళకు అరుదుగా ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే రుతుక్రమం వస్తూ మొదటిరోజున అధిక రక్తస్రావం జరుగుతుంది. పదిహేనేళ్ళ క్రితం దీనిని పీసీఓడీ గా గుర్తించారు. ఆమె తక్కువ శక్తి స్థాయితో బలహీనంగా ఉండడం వలన ఇది ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆమె ఇన్ని సంవత్సరాలుగా అల్లోపతీ చికిత్స తీసుకుంటూ గత ఎనిమిది నెలలుగా ఆయుర్వేద చికిత్స కూడా తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. రెండు చికిత్సలను నిలిపివేసి వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2019 ఆగస్టు 21న జరిగిన ప్రధమ సందర్శన సమయంలో ఆమె కలత చెంది ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:

   CC8.4 Ovaries & Uterus + CC8.8 Menses irregular + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS 

రెండు వారాల తర్వాత ఆమె శక్తి స్థాయి 50% మెరుగుపడింది. సెప్టెంబర్ 21న చాలాకాలం తర్వాత సాధారణ స్థాయిలో ఆమెకు రుతుస్రావం వచ్చినప్పుడు ఆమె పొంగిపోయారు. ఆ తర్వాత సాధారణ రక్తస్రావంతో ఆమె పీరియడ్స్ సక్రమంగా ఉంటున్నాయి. 2020 జులైలో మోతాదు OD కి తగ్గించబడింది, దానిని ఆమె మెయింటనెన్స్  మోతాదుగా తీసుకుంటున్నారు. 2022 ఫిబ్రవరి నాటికి ఆమె చక్కగా ఉన్నారు, ఆమె శక్తి స్థాయి కూడా బాగానే ఉంది. 15 సంవత్సరాల సమస్య ఒక నెలలో పరిష్కరింపబడిన ఈ  అద్భుతమైన విజయమే ఆమెను వైబ్రియానిక్స్ కోర్సు చేయడానికి ప్రేరేపించి 2021 నవంబర్లో ఆమె ప్రాక్టీషనర్ గా అర్హత సాధించారు.