Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

భయము 11581...India


35 ఏళ్ల మహిళకు 2020 మే నెలలో రుతుక్రమంలో విపరీతమైన రక్తస్రావం జరిగింది. ఎప్పుడూ సాధారణ స్థాయిలో రుతుక్రమం కొనసాగే క్రమంలో ఆమెకు ఇది అసాధారణమైన మరియు భయపెట్టే అనుభవం. రెండు నెలల పాటు తీసుకున్న అల్లోపతీ చికిత్స ఈ సమస్యను పరిష్కరించింది. ఐతే రక్తస్రావం అవడం, భయం వలన మరియు ఆచరణాత్మకంగా అనేక విషయాలలో ఉదాహరణకు తన కుటుంబం పట్ల భయం, భవిష్యత్తు పట్ల ఆందోళన మొదలైన విషయాల కారణంగా ఇది ఎక్కువ ఔతోంది. చివరికి తాను చూసిన టీవీ షోలలో ఘటనలను తన జీవితానికి అన్వయించుకోవడం ప్రారంభించారు. ఆమె భయాలు త్వరలోనే అహేతుకంగా మరియు విపరీతంగా మారడంతో ఆమె ఆందోళన తీవ్రమైంది. ఆమె ఒక మనోరోగ వైద్యులను  సంప్రదించారు. వారు సూచించిన యాంటీ డిప్రెసెంట్స్ పనిచేయక పోవడంతో ఆపివేశారు. 2020 నవంబర్ 5 న ఆమె అత్తగారు ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది రెమిడీ ఇచ్చారు:

CC8.1 Female tonic + CC8.7 Menses frequent + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing…TDS 

దీనికి అదనంగా ప్రాక్టీషనర్ రోగిని ఫోన్ ద్వారా కౌన్సిలింగ్ చేసి ఆమెలో ధైర్యాన్ని నింపి, ఆమె త్వరలోనే పూర్తిగా కోలుకుంటుందని  హామీ ఇచ్చారు. వారం తర్వాత రోగి తన భయాలు అలాగే ఉన్నాయని తెలియజేయడానికి కాల్ చేశారు. కనీసం మరో మూడు వారాల పాటు కొనసాగించాలని ఆమెకు ప్రాక్టీషనరు సూచించారు. కేవలం రెండు వారాల తర్వాత రోగి మరలా ఫోన్ చేసి ఏమాత్రం మార్పు లేదని చెప్పారు. ఆమెకు మరో మందు ఇస్తానని దీంతో త్వరగా నయమవుతుందని ఐతే ఒక నెల రోజుల పాటు తీసుకోవాలని చెపుతూ గతంలో ఇచ్చిన రెమిడీనే బాగా పనిచేస్తుందనే విశ్వాసంతో దానినే పునరావృతం చేశారు. ఆమె కొద్దిగా రక్తహీనతతో ఉన్నట్లు కనిపించడంతో ఆమె తన స్థాయిని మెరుగు పరచడానికి ప్రతిరోజూ దానిమ్మ మరియు ఖర్జూరం తినమని సలహా ఇచ్చారు.

2021 ఫిబ్రవరి 10 న రోగి తన భయాలు పూర్తిగా పోయాయని ఇప్పుడు ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. మోతాదు పదిరోజులకు OD కి తగ్గించబడింది, ఆ తర్వాత గోళీలు అయిపోయే వరకు కొన్ని వారాలపాటు OW కి తగ్గించబడింది. 2022 జనవరి నాటికి ఆమె బాగానే ఉన్నారు.