ప్రశ్నలు జవాబులు
Vol 4 సంచిక 4
July/August 2013
1. ప్రశ్న : 108CC బాక్సు సంరక్షించడానికి ఉత్తమైన మార్గం ఏమిటి?
జవాబు : ఇంట్లో మొబైల్, కార్డ్లెస్ ఫోన్, మైక్రోవేవ్ మిషనను, టెలివిజన్, కంప్యూటర్, వంటి రేడియేషన్ కారకాల నుండి కొంత దూరం వీలైతే మీటర్ లేదా మూడు అడుగులు దూరంగా ఉంచడం మంచిది. మీ ప్రయాణాలలో ముఖ్యంగా విమాన ప్రయాణ సమయంలో మీరు ఆందోళన చెందుతుంటే సాధారణ కిచెన్ అల్యూమినియం ఫోయిల్ లేదా రేకు పూర్తిగా చుట్టడం ఆచరణాత్మకమైన మార్గము.
_____________________________________
2. ప్రశ్న : నా 108CC బాక్స్ రేడియేషన్ ప్రభావానికి గురి అయిందని భావిస్తే ఏం చేయాలి?
జవాబు : మీ 108CC బాక్సు రేడియేషన్ వల్ల ప్రభావితమైందని మీరు భావించి నట్లయితే మీ పెట్టెను రీఛార్జ్ చేయడానికి మీ యొక్క టీచర్ లేదా స్థానిక సమన్వయకర్త తో రీచార్జీకి ఏర్పాట్లు చేసుకోవాలి.
_____________________________________
3. ప్రశ్న : 108CC బాక్సును ఏ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి? ఈ బాక్సును మనతో పాటు తీసుకెళుతున్నప్పుడు లేదా ప్రయాణిస్తున్నప్పుడు బాగా చల్లగా లేదా బాగా వేడిగా ఉన్న (ప్రత్యక్ష సూర్యకాంతికి గురి కాకుండా) సామానుల పెట్టె లేదా కారు డిక్కీ వంటి వాతావరణంలో ఉంచవచ్చా?
జవాబు: గది ఉష్ణోగ్రత వద్ద 108 సిసి బాక్సును ఉంచవచ్చు. గదిలో చల్లగా చీకటి ప్రదేశంలో ఈ బాక్సును ఉంచడం శ్రేయస్కరం. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కారు డిక్కీలో తీసుకువెళ్లడం మంచిది కాదు. అటువంటి సందర్భంలో లోపల చల్లగా ఉన్న ఇన్సులేటర్ బాక్సులో తీసుకువెళ్లడం మంచిది. కానీ ఫ్రిజ్ లో మాత్రం బాక్స్ లేదా పిల్ల్స్ బాటిల్ లు పెట్టకూడదు.
_____________________________________
4. ప్రశ్న : నా కుటుంబం నీరు త్రాగటానికి స్టెయిన్లెస్ స్టీల్ గ్లాసును ఉపయోగిస్తుంది. ఇట్టి గ్లాసులో ఉన్న నీటిలో వైబ్రియానిక్స్ రెమిడీ వేసుకొని లోహం కాని చంచాతో తీసుకుంటే నివారణపై ఇది ఏమైనా ప్రభావం చూపుతుందా?
జవాబు : ప్రభావితం చేయకుండా మీరు మీ ఇంట్లో ఏదైనా లోహ పాత్రలు ఉపయోగించవచ్చు. ఐతే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మీరు ఉపయోగించే చంచా లేదా లోహపు పాత్ర రెమిడీ లతో నేరుగా కాంటాక్ట్ అవకుండా చూసుకోవాలి.
_____________________________________
5. ప్రశ్న : పగిలిన డ్రాపర్ బాటిళ్లలో మిగిలి ఉన్న రెమిడీని కొత్త బాటిల్ తయారీకి ఉపయోగించవచ్చా?
జవాబు : అవును ఉపయోగించవచ్చు. ఐతే అట్టి ద్రవంలో గాజు శకలాలు లేకుండా జాగ్రత్త వహించాలి.
_____________________________________
6. ప్రశ్న : మనకు కొత్త బాటిల్ వచ్చినప్పుడు కాంబోను రీమేక్ చేయడానికి మరొక కిట్ నుండి కేవలం ఒక చుక్క కాంబో సరిపోతుందా?
జవాబు : అవును, ఒక చుక్క సరిపోతుంది.
_____________________________________
7. ప్రశ్న : సీసాకి పగుళ్లు లేకపోయినప్పటికీ దానిలో కోంబో ఏమీ లేకుండా ఖాళీఅయిపోయింది. మరింత రెమిడీ తయారుచేయడానికి నేను దాన్ని ఆల్కహాల్తో నింపవచ్చా?
జవాబు : అవును మీరు నింపిన తరువాత మీ అరచేతికి వ్యతిరేకంగా 9సార్లు నొక్కుతూ షేక్ చేయడం ద్వారా రెమిడీ తయారవుతుంది.
_____________________________________
8. ప్రశ్న : నేను ప్రయాణించేటప్పుడు లేదా పనికి తీసుకెళ్లేటప్పుడు నా బాటిల్ను అల్యూమినియం ఫోయిల్ తో చుట్టడం లేదా అల్యూమినియం డబ్బాలో పెట్టి గానీ తీసుకు వెళ్ళాలా?
జవాబు : అవును, ఇది ఖచ్చితంగా రేడియేషన్ ద్వారా గోళీలు తటస్థీకరణకు గురికాకుండా ఎక్కువ రక్షణను అందిస్తుంది.
_____________________________________
9. ప్రశ్న : నా అల్యూమినియం పెట్టె రేడియేషన్ నుండి నా బాక్సును రక్షిస్తుందని నేను ఖచ్చితంగా ఎలా చెప్పగలను?
జవాబు : అల్యూమినియం బాక్స్ లోపల మొబైల్ ఫోన్ ఉంచండి ఇప్పుడు మరొక ఫోన్ నుండి మొబైల్ నెంబర్ను డయల్ చేయండి. బాక్సు మంచిగా ఉంటే మొబైల్ ఫోన్ రింగ్ అవ్వదు. మీరు ఇప్పుడు పెట్టెను తెరిస్తే మొబైల్ రింగ్ ప్రారంభమవుతుంది.
_____________________________________