Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 3 సంచిక 4
July/August 2012


ప్రియమైనచికిత్సానిపుణులకు

మీనుండి అందుతున్న నెల వారీ రిపోర్టుల ద్వారా మీరు ఎన్ని గంటలు ఈ వైబ్రో సేవలో పాల్గొంటున్నారు, మీ నుండి లభించే చికిత్స ద్వారా ఎంతమంది రోగులు మీరందించే ఈ వైబ్రో చికిత్సా పద్దతి ద్వారా స్వస్థత పొంది ఆరోగ్యవంతులవుతున్నారు అనే విషయాలు తెలుసుకోవడం ఎంతో సంతృప్తినిస్తోంది. నిజం చెప్పాలంటే భగవంతుడి దయ మనపైన అపారంగా ఉంది, ఉంటుంది  అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. అమెరికా లోనూ మరియు బ్రిటన్ లోనూ వైబ్రియోనిక్స్ సేవ కోసం స్వామి కొత్త మార్గాలను అందుబాటులోనికి తీసుకు వస్తున్నారు (ప్రస్తుతం నెలకు రెండు సార్లు ఈ శిబిరాలు జరుగుతున్నాయి).

 

 ప్రతీ నెలలో రెండు ఆది వారాలు వాషింగ్ టన్ డిసి లో, వైట్ హౌస్ సమీపంలో ఉన్న పార్కులో పలు మత విశ్వాసాలకు చెందిన ఒక ఆధ్యాత్మిక బృందం 100-150 వరకూ గూడు లేని నిరుపేదలకు వైద్య చికిత్స నందిస్తున్నారు. విశేష మేమిటంటే ఈ మందులతో పాటు రుచికరమైన వేడి వేడి శాకాహార భోజనం, చల్లని, వెచ్చని పానీయాలు కూడా ప్రసన్నవదనాలతో పేషంట్లకు అందించ బడుతున్నాయి. ఒక సీనియర్ వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ 1339…యుఎస్ఎ  మరియు వారి సహాయకురాలు ఈ పార్కులో నిస్సహాయులకు మధ్యాహ్న భోజనం ఇచ్చే సమయంలో ఒక టేబుల్ పెట్టుకొని వీరందరికి వైబ్రో మందులు ఇవ్వడానికి అనుమతింప బడ్డారు. ఒక మహిళ కంటికి కేటరాక్ట్ (కంటిశుక్లం) నిమిత్తం రెమిడి తీసుకున్నారు. నెల తర్వాత ఆమె అదే ప్రదేశానికి వచ్చి ప్రాక్టీషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు, ఎందుకంటే ఆమె కంటి దృష్టి అద్భుతంగా మెరుగయ్యింది. ఇటువంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఈ పార్కులో ప్రాక్టీషనర్ల కృషి వల్ల సాధారణ మయ్యాయి. ఈ క్యాంపు కూడా పార్కులో సజావుగా సాగుతోంది. ఇదంతా చూసాక ఈ నిరాశ్రయులకు ప్రత్యామ్నాయ చికిత్సలు ఎంత అవసరమో ప్రాక్టీషనర్ కు అర్ధమయ్యింది. ఎందుకంటే ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఇతర వైద్య విధానాలతో  ఉత్పన్నమయ్యే సమస్యలు ప్రజలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆకర్షితులయ్యే విధంగా చేస్తున్నాయి.  

 

లండన్ లోని సౌతాల్ పార్కు వద్ద ప్రతీ సంవత్సరం వివిధ మత విశ్వాసాల సమ్మేళనం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అక్కడి నిర్వాహకుల పిలుపు మేరకు జూలై 8 వ తేదీన మన వైబ్రియానిక్స్ టీం అక్కడ ఒక మెడికల్ క్యాంపు నిర్వహించారు.  అననుకూల వాతావరణము కొంచంసేపు దోబూచులాడినా స్వామి దయతో అనుకూలంగా మారడమే కాక అసంఖ్యాకంగా ప్రజలు వచ్చి వైబ్రియానిక్స్ గురించి తెలుసుకొనడం వారిలో కొందరు చికిత్స పొందడం కూడా జరిగింది. అంకిత భావం గల ప్రాక్టీషనర్లు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ ఓపికగా కేంద్రం వద్ద ఉండడంతో 121మంది పేషంట్లు లబ్ది పొందారు. సీనియర్ ప్రాక్టీషనర్లకు రెండు నెలల క్రిందట శిక్షణ తీసుకున్న కొత్త ప్రాక్టీషనర్లు కూడా సహాయ పడడం విశేషం. నిర్వహణ సులభతరం చేయడానికి కొందరు రెమిడిలు తయారుచేయం, కొందరు పేషంట్లకు రెమిడిలు వాడే విధానాన్ని వివరించడం, కొందరు రిపోర్టులు తయారుచేయడం ఈ విధంగా పని విభజన చేసుకున్నారు. ప్రత్యేకంగా ఒక బృందం తమ లాప్టాప్ లో జిజ్ఞాస కలవారికి వైబ్రియానిక్స్ ప్రదర్శన నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు. అక్కడ చేరిన ప్రతీ ఒక్కరూ స్వామి అక్కడే ఉన్న అనుభూతిని పొందడం విశేషం.   

చురుకైన అభ్యాసకులందరూ వైబ్రో సేవలో పాలుపంచుకుంటూనే మీ సౌకర్యాన్ని వీడి కొంత సమయాన్ని వెచ్చించి జనబాహుళ్యము లోనికి వెళ్లి ఇటువంటి క్యాంపుల ద్వారా ఇంకా వైబ్రియానిక్స్ అంటే తెలియని ప్రజానీకానికి దీనిని గురించి తెలియజేయ వలసిందిగా విజ్ఞప్తి. ఒకవేళ మీరు ఇప్పటికే అటువంటివి ఏర్పాటు చేసి ఉంటే చేయాలనే ఆలోచనలో ఉంటే మీ ఆనందంలో పాలుపంచుకొనడానికి మాకు తెలియపరచండి. పేషంట్ల నుండి వచ్చే అద్భుతమైన స్పందనే  ( వీరిలో ఎక్కువశాతం మరే ఇతర వైద్యవిధానానికి డబ్బులు వెచ్చంచే స్థితిలో ఉండరు) స్వామి నిరంతరం మనతోనే ఉన్నారు, పేషంట్లను వారే పంపుతున్నారు, చికిత్సా వారే చేస్తున్నారు  అనే విషయాన్ని గుర్తుచేస్తూ ఉంటుంది.  

ఇటీవలే నేను చూసిన ఆసక్తికరమైన మరియు అనేక విజ్ఞాన విశేషాలను తెలియజేసే వెబ్సైట్ గురించి సమాచారమును మీతో పంచుకోవలనుకుంటున్నాను. అమెరికా లోని జాతీయ వైద్య గ్రంధాలయమునకు చెందిన  ఈ వెబ్సైట్ వివధ వైద్య పరిస్థితులు, ప్రక్రియల గురించిన వీడియో సమాచారము చక్కని బోధనా విషయాలుగా అందిస్తుంది. ముఖ్యంగా ఎటువంటి వైద్య నేపథ్యమూ లేని మన ప్రాక్టీషనర్లకు ఇవి ఎంతో ప్రయోజనకారిగా ఉంటాయి.

మీ అనుభవంలోకి వచ్చిన అసాధారణ రోగచరిత్రలను మాకు పంపవలసిందిగా మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాను. త్వరలోనే ఇటువంటి అద్భుతమైన రోగచరిత్రలతో మరో  పుస్తకాన్ని ముద్రించే ఆలోచనతో ఉన్నాము. మీ సహకారము లేనిదే మేమిది చేయలేము కనుక మీరు పంపే రోగచరిత్రలను ముద్రణా రూపంలో చూసుకోవడానికి (ఐతే అభ్యాసకుడు  మరియు రోగి యొక్క గోప్యతను కాపాడడానికి పేర్లను ; ముద్రించము కేవలం మీ రిజిస్ట్రేషన్ నంబరు మాత్రము ముద్రిస్తాము). త్వరలోనే మీ నుండి అటువంటి స్పందనను ఆకాంక్షిస్తూ.

ప్రేమతో సాయి సేవలో

జిత్.కె.అగ్గర్వాల్

 

Vibrionics సౌతాల్ పార్క్, లండన్ లో విశ్వాసాల పండుగ యూనిటీ నిలిచిపోయినట్లు

 

 

 

 

 

 

 

పార్క్ లో vibro - హోంలెస్ వాషింగ్టన్ DC USA అందిస్తోంది