Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రకటనలు

Vol 2 సంచిక 3
May 2011


  • నిర్వహించబడిన శిక్షణా శిబిరాలు

  • 2011 ఫెబ్రవరి 26 న, భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి కృపతో, ప్రశాంతిగ్రాం లోనున్న శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యుట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ( సూపర్ స్పెషాలిటి హాస్పిటల్) లో పనిచేస్తున్న డాక్టర్లకు మరియు జనరల్ హాస్పిటల్ డాక్టర్లకు, ఒక వైబ్రియానిక్స్ సదస్సు నిర్వహించబడింది. డా.అగ్గర్వాల్ గారు వైబ్రియానిక్స్ పై ఇచ్చిన పరిచయంతో సదస్సు ప్రారంభమైనది. దీని తర్వాత, ముంబై నుండి వచ్చిన డా.దీపా హోస్కోటే 2640, అనేక ఆశక్తికరమైన మరియు అత్భుతమైన రీతిలో స్వస్థమైన రోగ చరిత్రలను ప్రదర్శించడం జరిగింది. గుండె, కళ్ళు, శ్వాస వ్యవస్థ మరియు అస్థిపంజర వ్యవస్థ సంబంధించిన పలు క్లిష్టమైన రోగ చరిత్రలను సమర్పించారు. నయంకావడం అసాధ్యమని, ఇతర డాక్టర్లు చే నిర్ధారించబడిన రోగులకు, వైబ్రో చికిత్స ద్వారా కొత్త జీవితాలు ప్రాప్తించాయి. ఈ సదస్సును ఆశ్పత్రికి చెందిన సిబ్బంది అనుకూలమైన రీతిలో అందుకున్నారు. ఈ సదస్సు ద్వారా, ప్రశాంతి నిలయంలో అందరికి వైబ్రియానిక్స్ పై  ఆశక్తి  మరియు ఈ ప్రత్యామ్నాయ చికిత్సా విధానం పై అవగాహన ఏర్పడింది.

  • పోలాండ్ లోనున్న ఒపోల్ లో, మే 14 మరియు 15 న, 15 మంది పాల్గొన్న ఒక JVP శిక్షణా శిభిరం నిర్వహించబడింది.

   జరగనున్న శిక్షణా శిబిరాలు

  • ఇండియా:  2011 జూన్ 24 నుండి 26 వరకు ఢిల్లీ, లో AVP లకు ప్రథమ శిక్షణా శిబిరం జరగనున్నది. మీ స్తానిక సమితి సంయోజకుడను సంప్రదించగలరు.
  • ఇంగ్లాండ్: 2011 జూన్ 25 నుండి 26 వరకు లండన్ లో JVP లకు శిక్షణా శిబిరం జరగనున్నది మరియు ఇతర వైబ్రో చికిత్సా నిపుణులకు రిఫ్రెషర్ శిక్షణా శిబిరం జరగనున్నది. వివరాలకు డా.అగ్గర్వాల్ను సంప్రదించండి: ఫోన్ నంబరు: 020-7209 3413 లేదా 01865-511 171 లేదా [email protected] కు ఇమెయిల్ పంపండి.
  •  పోలాండ్: 2011 నవంబర్ 12 నుండి 13 వరకు  వ్రొక్లావ్ లో, JVP లకు మరియు ఇతర చికిత్సా నిపుణలకు రిఫ్రెషర్ శిక్షణా శిబిరం జరగనున్నది. ఆసక్తికరమైన రోగ చరిత్రలపై సమీక్ష జరపబడుతుంది. వివరాలకు డరిఉస్శ్ హేబిస్జ్ ను సంప్రదించండి: ఫోన్ నంబరు: 071-349 5010 లేదా [email protected]. కు ఇమెయిల్ పంపండి.

గమనిక: భవిష్యత్తులో మీ ఇమెయిల్ చిరునామాలను మారిస్తే, వీలైనంత త్వరగా క్రింది ఇమెయిల్ చిరునామాకు తెలియచేయండి: [email protected]. ఇమెయిల్ సదుపాయం గురించి తెలియని వైబ్రో సాధకులకు దయచేసి సమాచారాన్ని తెలియచేయండి. మీ సహకారానికి ధన్యవాదాలు.

ప్రస్తుతం మా వెబ్సైట్ నిర్మాణంలో ఉండడం కారణంగా కొన్ని అంశాలు అందుబాటులో ఉండవని తెలియచేసుకుంటున్నాము. www.vibrionics.org వద్ద పురోగతి తనిఖీ చేయగలరు.

జై సాయి రామ్!